ఓడ ఖర్చు కన్నా ఎక్కువ!

టైటానిక్‌ ఓడ అన్నా, దాని మీద వచ్చిన సినిమా అన్నా తెలియని వారు ఉండరు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే టైటానిక్‌ ఓడను నిర్మించడానికి అయిన ఖర్చు కన్నా, దాని మీద సినిమా తీయడానికే ఎక్కువ ఖర్చయిందట. 1912 ఏప్రిల్‌ 15న మునిగిపోయిన ఈ ఓడను అప్పట్లో రూపొందించడానికి 1.5 మిలియన్ల గ్రేట్‌బ్రిటన్‌ పౌండ్లు ఖర్చయింది. దీన్ని 2018 లెక్కలకు సరిచూస్తే 144.5 మిలియన్‌ అమెరికన్‌ డాలర్లకు సమానం. హాలీవుడ్‌ దర్శకుడు జేమ్స్‌ కామెరూన్‌ 1997లో రూపొందించిన ‘టైటానిక్‌’ సినిమాకు 200 మిలియన్‌ డాలర్లు ఖర్చయింది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.