ఎక్కువ భాషల్లో రీమేకైన తెలుగు చిత్రం

ఒక భాషలో తెరకెక్కి మంచి విజయం అందుకున్న సినిమాలను ఇతర భాషల్లో రీమేక్‌ చేయడం సర్వసాధారణం. అలాంటి కొన్ని చిత్రాల్ని రెండు, మూడు భాషల్లో రీమేక్‌ చేసుంటారు. మహా అయితే నాలుగైదు. ఓ స్వచ్ఛమైన ప్రేమకథ ఏకంగా ఆరు భారతీయ భాషల్లో, రెండు ఇతర దేశాల భాషల్లో రీమేక్‌ అయిందంటే నమ్మగలమా? ఆ సినిమా మరేదో కాదు ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’. ప్రముఖ కొరియోగ్రాఫర్‌ ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలోని సిద్ధార్ధ్, త్రిష నటన ఎప్పటికీ మర్చిపోలేనిది. దేవీశ్రీ ప్రసాద్‌ అందించిన సంగీతం, సిరివెన్నెల సాహిత్యం ఈ సినిమా విజయాన్ని మరో మెట్టు ఎక్కించాయి. ఈ చిత్రం తమిళ, కన్నడ, ఒరియా, బెంగాలీ, పంజాబీ, హిందీ భాషలతోపాటు బంగ్లాదేశ్, నేపాల్‌లోనూ ఆయా భాషల్లో రీమేకై.. అత్యధిక భాషల్లో రీమేకైన తెలుగు చిత్రంగా రికార్డు సృష్టించింది. అంతేకాదు అత్యధిక ఫిలింఫేర్‌ అవార్డులు అందుకున్న చిత్రంగానూ ఘనత సాధించింది. ఈ ఆల్‌టైమ్‌ హిట్‌ చిత్రానికి 5 నంది అవార్డులు, 9 ఫిలింఫేర్‌ అవార్డులు, 2 సంతోషం అవార్డులు దక్కాయి.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.