గాయని ఇంటిపేరుపై ఉడత!

అలనాటి గాయని సరోజిని ఎక్కువగా పిల్లలకి పాడేది. ‘త్యాగయ్య’ (1946) సినిమాలో పాడుతున్నప్పుడు రేణుకావారి ఆఫీసుకి రోజూవెళ్లి పాట నేర్చుకోవాలి. ఆఫీసు పెరట్లో జామచెట్టు ఉండేది. మధ్యలో ఖాళీ ఉన్నప్పుడు - సరోజిని జామచెట్టు ఎక్కి అక్కడే కూచుని కాయలు తినేది. నాగయ్య అది చూసి, ‘‘ఎప్పుడు చూసినా ఉడతలా చెట్టుమీదనే వుంటావే..’’ అని, అప్పటినుంచి ‘ఉడతా’ అని పిలిచేవారు. అందరూ అలా పిలవడం మొదలెట్టేసరికి ‘ఉడత సరోజిని’ అయ్యింది.

- రావి కొండలరావు


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.