బాలీ‌వు‌డ్‌లో వామ‌పక్ష బెంగాలి బాబు

అతడు బెంగాలీ బాబు.‌ పేరు ఉత్పల్‌ దత్‌.‌ మంచి రంగ‌స్థల నటుడు, నాటక రచ‌యిత, దర్శ‌కుడు కూడా.‌ డెబ్బై ఏళ్ల క్రితం ‌‘లిటిల్‌ థియే‌టర్‌ గ్రూప్‌’‌ పేరుతో ఒక నాటక సంస్థను నెల‌కొల్పి షేక్‌స్పి‌యర్‌ నాట‌కా‌లను విస్తృతంగా ప్రద‌ర్శిం‌చాడు.‌ ఇప్పుడు అదే సంస్థ ‌‘ఎపిక్‌ థియే‌టర్‌’‌ గుర్తింపు పొందింది.‌ మార్కిస్టు భావ‌జా‌లంతో ఈ నాటక సంస్థ ‌‘కల్లోల్‌’, ‌‘మను‌షేర్‌ అధి‌కార్‌’‌ వంటి అనేక రంస్థల నాటక ప్రద‌ర్శ‌నలు ఇచ్చింది.‌ షేక్‌స్పి‌యర్‌ నాట‌కా‌లను, రష్యన్, క్లాసి‌క్స్‌ను బెంగాలి భాష‌లోకి అను‌వ‌దిం‌చిన ప్రతి‌భా‌శాలి ఉత్ప‌ల్‌దత్‌.‌ అతడు క్రమంగా సినిమా రంగా‌నికి పరి‌చ‌యమై నల‌భై‌ఏళ్ల అను‌భ‌వంతో వందకు పైగా బెంగాలి, హిందీ సిని‌మా‌లలో క్యార‌క్టర్‌ నటు‌డిగా రాణిం‌చారు.‌ మృణా‌ల్‌సేన్‌ నిర్మిం‌చిన ‌‘భువన్‌ షోమ్‌’, ‌‘సత్య‌జి‌త్‌రాయ్‌ నిర్మిం‌చిన ‌‘అగం‌తక్‌’, ‌‘జనా‌రణ్య’, ‌‘హిరక్‌ రాజర్‌ దేశే’, గౌత‌మ్‌ఘోష్‌ చిత్రాలు ‌‘పార్‌’, ‌‘పద్మ‌నా‌దిర్‌ మంజ్హి’, హృషి‌కేష్‌ ముఖర్జీ నిర్మిం‌చిన ‌‘గుడ్డీ’, ‌‘గోల్‌మాల్‌’, ‌‘రంగ్‌ భి రంగ్‌’, సిని‌మా‌లలో అద్భు‌త‌మైన పాత్రలు పోషిం‌చారు.‌ భువన్‌ షోమ్‌లో నట‌నకు ఉత్తమ నటు‌డిగా జాతీయ పుర‌స్కారం, ఉత్తమ హాస్య‌న‌టు‌డిగా మూడు, ఉత్తమ సహాయ నటు‌డిగా మరో మూడు ఫిలిం‌ఫేర్‌ బహు‌మ‌తులు, సంగీత నాటక ఆకా‌డమీ పుర‌స్కా‌రాలు ఉత్ప‌ల్‌ద‌త్‌ని వరిం‌చాయి.‌ హిందీ చిత్రరం‌గంలో ప్రవే‌శించి గుడ్డి, గోల్‌మాల్, నరమ్‌ గరమ్, రంగ్‌ భిరంగి’, షాకేన్‌ వంటి సిని‌మాల్లో హాస్య‌న‌టు‌డిగా రాణిం‌చారు.‌ అమి‌తాబ్‌ బచన్‌ నటిం‌చిన ‌‘ది గ్రేట్‌ గ్యాంబ్లర్‌’, ‌‘ఇంక్వి‌లాబ్‌’‌ సిని‌మాల్లో విలన్‌ పాత్రలు పోషిం‌చారు.‌ ‌‘సాథ్‌ హిందూ‌స్తానీ’‌లో ఉత్ప‌త‌ల్‌దత్‌ ప్రధాన పాత్ర.‌ స్వయంగా మార్కి‌స్టుగా ముద్ర వేయిం‌చు‌కున్న ఉత్ప‌ల్‌దత్‌ నాట‌కాలు, ‌‘బ్యారి‌కేడ్‌’, దుస్స¬్వప్నే నగరి’, ‌‘ఎబార్‌ రాజర్‌ పాల’‌ నిషే‌ధా‌నికి గురైనా, వాటి ప్రద‌ర్శ‌న‌లకు ప్రేక్ష‌కులు విప‌రీ‌తంగా వచ్చే‌వారు.‌ సిపాయి కలహం తర్వాత భారత ప్రజలు బ్రిటీష్‌ ప్రభుత్వం మీద తిర‌గ‌బడే నేప‌థ్యంలో రచిం‌చిన నాటకం ‌‘కల్లోల్‌’‌ను నిషే‌ధిం‌చ‌డమే కాకుండా, ఉత్ప‌ల్‌ద‌త్‌ని బ్రిటీష్‌ ప్రభుత్వం కారా‌గా‌రంలో బంధిం‌చింది.‌ అటు‌వంటి ఈ బహు‌ముఖ ప్రజ్ఞ‌శాలి 1993లో కోల్‌క‌త్తాలో కన్ను‌మూ‌శారు.‌Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.