మూడు జంటలకి ఒకటే గాత్రం


‘వారసత్వం’ (1964) సినిమాలో మూడు జంటలు పాడే ఒక పాట ఉంది. రామారావు, అంజలీదేవి ముఖ్య పాత్రధారులు. పాట రికార్డింగ్‌ ఎప్పుడో జరిగిపోయింది. రామారావుకి ఘంటసాల పాడగా, తక్కిన జంటల్లో పురుష గాత్రం పిఠాపురం నాగేశ్వరరావు. ఇంకొకరిది అయితే చిత్రీకరణ సమయంలో రామారావు, అంజలీదేవి లభించిన రోజుల్లో తక్కిన వాళ్లు దొరకలేదు. వీళ్ళ కోసం ఆగితే పెద్ద తారలు మళ్ళీ దొరకరని, మూడు జంటలు పాడవలసిన పాటలు - ఆ ఇద్దరి మీదనే చిత్రీకరించారు. అంటే రామారావు, అంజలీదేవి మీద ఘంటసాల, సుశీల పాడిన వెంటనే, పిఠాపురం వాళ్ల కంఠాలు వెంటనే వినవస్తాయి. సినిమా అలాగే విడుదల చేశారు గాని, నాలుగైదు రోజుల తర్వాత ఆ పాట మీద ఆక్షేపణలు రావడంతో మొత్తం పాటని చిత్రంలోంచి తొలగించారు.- రావి కొండలరావు


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.