తొలి ఛాయాగ్రహణ దర్శకురాలు

మహిళలు సాధారణంగా ఛాయాగ్రహణం జోలికి పోరు. అందులో ఇబ్బందులున్నాయి. ఇదే, విదేశాల్లో మహిళలు దర్శకులు, ఎడిటర్లు, ఛాయాగ్రాహకులూ ఐన తర్వాత మన దేశంలో కూడా స్త్రీలు ఆ బాధ్యతను స్వీకరించారు. ఆసియా ఖండంలోనే మొదటిసారిగా ఛాయాగ్రహణం నిర్వహించిన వనిత విజయలక్ష్మి. ఆమెది బెంగళూరు. బి.ఆర్‌. పంతులు కుమార్తె. బి.ఆర్‌.పంతులు ‘శ్రీకృష్ణదేవరాయ’ పేరుతో, భారీ చిత్రం (కలర్‌) తీసినప్పుడు, ఆ చిత్రానికి ఆమె పనిచేసింది. (1969) రాజ్‌ కుమార్‌ కృష్ణదేవరాయ పాత్ర ధరించగా బి.ఆర్‌.పంతులు తిమ్మరుసు పాత్ర ధరించారు.


-రావి కొండల రావు   


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.