అద్దంలో దేవుణ్ని చూసిన విశ్వనాథ్‌

ప్రతి చిత్రం శుభగడియల్లో లాంఛనంగా ప్రారంభమవుతుంది. ఆ తర్వాత రెగ్యులర్‌ షూటింగ్‌ జరుపుకుంటుంది. సెంటిమెంట్‌ మేరకు దేవుడి చిత్ర పటాలపై ముహూర్తపు సన్నివేశాన్ని షూట్‌ చేస్తుంటారు. అయితే కళాతపస్వి విశ్వనాథ్‌కి మాత్రం ఓ సారి ఈ అవకాశం రాలేదు. అది కూడా ఆయన దర్శకత్వం వహించిన తొలి చిత్రానికి. అక్కినేని నాగేశ్వరరావు కథానాయకుడుగా విశ్వనాథ్‌ ‘ఆత్మగౌరవం’ తెరకెక్కించిన విషయం తెలిసిందే. అన్నపూర్ణ పిక్చర్స్‌ సంస్థ నిర్మించింది. నిర్మాణ సంస్థకు ఈ సెంటిమెంట్‌ లేకపోవడంతో తొలి షాట్‌ను దేవుడి పటాలపై చిత్రీకరించాలనుకున్న విశ్వనాథ్‌కు అవకాశం రాలేదు. అప్పుడు ఆయన ఏం చేశారంటే.. ‘అద్దం శ్రీ మహాలక్ష్మికి ప్రతిరూపం’ అని పెద్దలు చెప్పిన మాటలు గుర్తొచ్చి ఏఎన్నార్‌ అద్దంలో టై సరిచేసుకునే దృశ్యాన్ని తొలి షాట్‌గా షూట్‌ చేశారు. దాంతోపాటు ‘ శ్రీనివాస చక్రవర్తి గార్ఠూ అంటూ అల్లు రామలింగయ్యతో వేంకటేశ్వర స్వామి పేరూ చెప్పించారు. అలా తన సినీ కెరీర్‌ను శుభారంభం చేసుకున్నారు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.