సినిమాలో ఒకరు, రికార్డులో ఒకరు

వాహిని వారి ‘సుమంగళి’, ‘దేవత’ చిత్రాల్లో నటించిన కూమారి మొదటి పేరు - నగరాజకుమారి. తరువాత రాజకుమారి. ఆ తరువాత కుమారి. ‘సుమంగళి’ సినిమాలో ‘రాధనిటు దయమాలీ విడచి’, ‘మబ్బుదొంతరల చాటున’ అన్న రెండు పాటలూ సినిమాలో ఆమే పాడింది. కానీ గ్రామ్‌ఫోన్‌ రికార్డులో ‘రాధనిటు దయమాలీ’ ఆమె కంఠంలోనే ఉన్నా, ‘మబ్బుదొంతరల చాటున’ మాత్రం ఆమె కంఠం కాదు. ఆ పాటని, సాబూ అనే అబ్బాయి పాడాడు!

- రావి కొండలరావు 


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.