రాజమౌళితో కల నిజం.. ‘మహాభారతం’ ధ్యేయం!!
‘క్షణం’, ‘అమితుమి’, ‘గూఢచారి’ వంటి వైవిధ్యభరిత కథలతో కథానాయకుడిగా ప్రేక్షకుల్లో మంచి క్రేజ్‌ సంపాదించుకున్నారు అడివి శేష్‌. ఇటీవలే విడుదలైన ‘ఎవరు’ చిత్రంతో ఈ జోరు తిరిగి కొనసాగించాడు. ఈ సినిమాపై విమర్శకుల సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర విజయాన్ని ఆస్వాదించే పనిలో ఉన్నారు శేష్‌. ఈ నేపథ్యంలో తాజాగా అడవిశేష్‌ ట్విటర్‌ వేదికగా అభిమానులతో ముచ్చటించారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.


మీ తర్వాతి చిత్రం ఎప్పుడు అన్నా?
అడవి శేష్‌: వచ్చే ఏడాది వస్తుంది. త్వరలోనే 'మేజర్‌'ను ప్రారంభిస్తాం.

భయ్యా 'గూఢచారి2' ఎప్పుడు?
అడవి శేష్‌: 'మేజర్‌' అయిపోగానే మొదలు పెడతాం.

తెలుగు చిత్ర పరిశ్రమలో మీ అభిమాన నటుడు ఎవరు?
అడవి శేష్‌: ఆ హీరో ఎవరో నాకూ తెలియదు. కానీ, చరిత్రలో ఎప్పటికీ ఉత్తమ నటుడు ఎస్వీఆర్‌

మీరు ఎందుకు ఒకే జోనర్‌లో సినిమాలు చేస్తున్నారు?
అడవి శేష్‌: అది నిజం కాదు. 'అమీతుమీ' కామెడీ, 'గూఢచారి' యాక్షన్‌, 'ఎవరు', 'క్షణం' థ్రిల్లర్‌ మూవీలు

హిందీ చిత్ర పరిశ్రమలోకి ఎప్పుడు వెళ్తారు?
అడవి శేష్‌: 'మేజర్‌' సినిమాను హిందీలోనూ విడుదల చేస్తాం.

'గూఢచారి' క్లైమాక్స్‌లో మీరు చూపించిన ప్రాంతం ఏది?
అడవి శేష్‌: లీవెన్‌వర్త్‌, మెట్‌రెయినర్‌

నాగార్జునగారితో సినిమా ఎప్పుడు చేస్తారు? అభిమానులం వేచి చూస్తున్నాం?
అడవి శేష్‌: ఆయన ఎప్పుడు అవకాశం ఇస్తే, అప్పుడు చేస్తా.

మీ నుంచి రొమాన్స్‌-కామెడీ సినిమా వస్తుందా? 'ఏజెంట్‌'గా చూసి బోర్‌కొట్టేసింది?
అడవి శేష్‌: అయితే 'మేజర్‌'లో ఎన్‌ఎస్‌జీ కమాండోగా చూడండి.

రాజమౌళి సర్‌ దర్శకత్వంలో సినిమా చేసే అవకాశం వస్తే?
అడవి శేష్‌: నా జీవితంలో అతిపెద్ద కల నిజమైనట్లు భావిస్తా.

ఒక సినిమాను అడాప్ట్‌ చేసుకోవడం లేదా కాపీ చేయడం రెండింటి మధ్య భేదం ఏంటి?
అడవి శేష్‌: అడాప్టేషన్‌: ఒక కథ రైట్స్‌ కొని, దానిలోని సోల్‌ను తీసుకుని కొత్త కథ అల్లడం- ఇది 'ఎవరు'
రీమేక్‌: ఒక కథ రైట్స్‌ తీసుకొని ఇంచుమించుగా సేమ్‌ టు సేమ్‌ మళ్లీ తీయడం -బద్లా
కాపీ: రైట్స్‌ తీసుకోకుండా దొంగిలించడం. లేపడం. కొట్టేయడం.

మీ కలల ప్రాజెక్టు ఏంటి?
అడవి శేష్‌: మహాభారతం


'మేజర్‌'లో మహేశ్‌బాబు ఏదైనా రోల్‌ చేస్తున్నారా?
అడవి శేష్‌: చేయడం లేదు.

బాలీవుడ్‌లో మీ అభిమాన కథానాయిక ఎవరు?
అడవి శేష్‌: ఎప్పటికీ నా అభిమాన కథానాయిక మధుబాల

మీరు హీరో కాకపోయి ఉంటే ఏ జాబ్‌ చేసేవారు?
అడవి శేష్‌: రచయిత

చిరంజీవి, పవన్‌కల్యాణ్‌ కోసం మీ దగ్గర కథ ఉందా?
అడవి శేష్‌: లేదండీ. ప్రస్తుతానికి 'ఎవరు' విజయాన్ని ఆస్వాదిస్తున్నాం.

'మేజర్‌' మూవీకి మహేశ్‌ ప్రొడ్యూస్‌ చేయడానికి కారణం?
అడవి శేష్‌: నా అదృష్టం.

కుటుంబ కథా చిత్రాలు చేయాలని మీకు ఉందా? ఎందుకంటే 'ఎవరు'లో ఎమోషనల్‌ సీన్లు అద్భుతంగా ఉన్నాయి. కుటుంబ ప్రేక్షకులు కూడా సులభంగా మీకు దగ్గరవుతారు కదా!
అడవి శేష్‌: నాకూ ఫ్యామిలీ సినిమా చేయాలని ఉంది. అయితే, ఆ సబ్జెక్ట్‌లను హ్యాండిల్‌ చేయడం చాలా కష్టం.

విజయ దేవరకొండపై మీ అభిప్రాయం ఏంటి?
అడవి శేష్‌: చాలా మంచోడు

ప్రభాస్‌ అన్న కోసం ఏదైనా స్క్రిప్ట్‌ రాశారా?
అడవి శేష్‌: లేదండీ. ప్రస్తుతానికి 'మేజర్‌' రాస్తున్నా.

అవకాశం వస్తే, మహేశ్‌బాబుని డైరెక్ట్‌ చేస్తారా? లేదా ఆయన సినిమాకు స్క్రిప్ట్‌ రాస్తారా?
అడవి శేష్‌: ప్రస్తుతానికి ఆయనే నాకు ఛాన్స్‌ ఇచ్చారు.

సమంత గురించి ఒక్క మాటలో చెప్పండి
అడవి శేష్‌: నెం.1


హాలీవుడ్‌, బాలీవుడ్‌ స్టైల్‌లో సిరిస్‌ చిత్రాలు ప్లాన్‌ చేయొచ్చు కదా!
అడవి శేష్‌: 'మేజర్‌' తర్వాత 'గూఢచారి2' తప్పకుండా తీస్తా.

మీరు అంత తెల్లగా ఉండటానికి కారణం? ఫెయిర్‌ అండ్‌ లవ్లీ వాడతారా?
అడవి శేష్‌: మా అమ్మ.

రామ్‌చరణ్‌ గురించి ఒక్క మాటలో చెప్పండి?
అడవి శేష్‌: 'రంగస్థలం'లో ఆయన నటన ఈ దశాబ్దానికే హైలైట్‌.

ప్రభాస్‌ గురించి ఒక్క మాటలో చెప్పండి?
అడవి శేష్‌: ఒక మాట సరిపోదు బ్రదర్‌

'2స్టేట్స్‌' రీమేక్‌ ఆగిపోయిందా?
అడవి శేష్‌: అవును ఆగిపోయింది.

మిమ్మల్ని ఎక్కువగా ప్రభావితం చేసిన ఫిలిం మేకర్‌ ఎవరు?
అడవి శేష్‌: నోలాన్‌, విఠలాచార్య, ఎల్వీ ప్రసాద్‌, ఫించెర్‌, కురుసోవా, గురు దత్త

ఇటీవల కాలంలో మీరు బాగా ఇష్టపడిన చిత్రాలు?
అడవి శేష్‌: ఓ బేబీ, జెర్సీ, బ్రోచేవరెవరురా.. మల్లేశం

మీలో మీకు నచ్చింది ఏంటి?
అడవి శేష్‌: నిద్రలేకుండా కూడా పనిచేస్తా.

బాలీవుడ్‌లో మీ క్రష్‌ ఎవరు?
అడవి శేష్‌: లీసా హేడెన్‌

మహేశ్‌బాబు నటించిన ఏ సినిమా మీ ఫెవరెట్‌
అడవి శేష్‌: మురారి, ఒక్కడు, అతడు. కానీ, ఖలేజాలో ఆయన నటన అంటే చాలా ఇష్టం.

పవన్‌కల్యాణ్‌ సినిమాల్లో మీకు నచ్చింది ఏంటి?
అడవి శేష్‌: తొలి ప్రేమCopyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.