‘పాగల్‌’ తర్వాత శ్రీ విష్ణుతో..

‘టాటా బిర్లా మధ్యలో లైలా’ చిత్రంతో నిర్మాతగా టాలీవుడ్‌కి పరిచయమయ్యారు బెక్కం వేణుగోపాల్‌. లక్కీ మీడియా పతాకంపై ‘ప్రేమ ఇష్క్‌ కాదల్‌’, ‘మేం వయసుకు వచ్చాం’, ‘హుషారు’ వంటి పలు ప్రేమ కథా చిత్రాలు నిర్మించారాయన. తాజాగా ఆయన ఫోన్‌ ద్వారా ముచ్చటించారు.


*ఈ పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కోవాలి

కరోనా మహమ్మారి బారి నుంచి ప్రపంచం బయటపడాలని కోరుకుంటున్నా. ఇలాంటి దుర్భరమైన పరిస్థితి వందేశ్లకోసారి వస్తుంది. దైర్యంగా ఎదుర్కోవాలి. ప్రభుత్వ సూచనలు పాటిస్తూ ఇంట్లోనే ఉంటున్నాను. పుట్టిన రోజు కుటుంబ సభ్యుల వధ్యనే జరుపుకుంటా.

*ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ ప్రభావం ఉండదు

ప్రేక్షకులు ఓటీటీ ప్లాట్‌కే అలవాటు పడ్డారు, ఇది థియేటర్ల మీద ప్రభావం చూపుతుందని నేను భావించట్లేదు. థియేటర్‌ అనుభూతి వేరు, ఓటీటీ వేరు. థియేటర్‌కు ప్రత్యామ్నాయం ఉండదు. అంతర్జాలం వచ్చిన తొలినాళ్లలో కూడా ఇదే చర్చ సాగింది. వెండితెరపై సినిమా చూసేందుకు ప్రేక్షకులు ముందుకురారని. కానీ అదేం జరగలేదు. ఇప్పుడు అంతే.

* ‘పాగల్‌’ని ప్రారంభించాం కానీ..

మార్చి 19న విశ్వక్‌ సేన్‌తో ‘పాగల్‌’ చిత్రం మొదలుపెట్టాం. నరేశ్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. లాక్‌డౌన్‌ కారణంగా రెగ్యులర్‌ షూటింగ్‌ వాయిదా వేశాం. పరిస్థితిలు అనుకూలించిన తర్వాత ప్రారంభిస్తాం.

*‘పాగల్‌’ తర్వాత

‘పాగల్‌’ తర్వాత శ్రీ విష్ణుతో ఓ సినిమా చేయబోతున్నాం. ప్రదీప్‌ అనే మరో దర్శకుడు పరిచయం కాబోతున్నాడు. వీటితోపాటు ‘రోటీ- కపడా- రొమాన్స్‌’ అనే చిత్రం అనుకుంటున్నాం. దిల్‌రాజుతో మరికొన్ని సినిమాలు సంయుక్తంగా నిర్మించే ఆలోచనలో ఉన్నా.  


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.