ఓపిక పట్టండి..సర్‌ప్రైజ్‌ ఇస్తా!
మంచి పర్సనాలిటీ, అందం ఉంటేనే కాదు అల్లరితనం, ఎనర్జీ, బుల్లెట్ల మాదిరి దూసుకొచ్చే డైలాగులు చెప్పినా హీరోగా మంచి పేరొస్తుంది అని నిరూపించారు యువ కథానాయకుడు రాజ్‌తరుణ్‌. తెలుగులో ‘ఉయ్యాలా జంపాలా’ సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైన రాజ్‌తరుణ్‌ తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తరువాత వరుసగా ‘సినిమా చూపిస్త మావ’, ‘కుమారి 21 ఎఫ్‌’, ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’, ‘ఈడో రకం ఆడో రకం’ తదితర సినిమాల్లో నటించారు. చివరిగా ‘లవర్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాజ్‌ తరుణ్‌ తన తర్వాతి సినిమా గురించి ఇంకా ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో తన తదుపరి ప్రాజెక్ట్‌ గురించి, ఇతర విషయాల గురించి ట్విటర్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నారు.


మీ తర్వాతి చిత్రం ఏంటి? ఎవరితో?


రాజ్‌ తరుణ్‌: అవికా గోర్‌ను అడగండి.

హీరో రామ్‌ గురించి ఒక్కమాటలో చెప్పండి?

అద్భుతమైన వ్యక్తి.

అన్నా.. మంచి కథలను ఎంచుకో..

ప్రస్తుతం అదే చేస్తున్నా. అందుకే నా తర్వాతి సినిమా రావడానికి ఇంత ఆలస్యం అవుతోంది.

అల్లు అర్జున్‌ గురించి మీ అభిప్రాయమేంటి?

హార్డ్‌ వర్క్‌కి ఉదాహరణ.

ఓ మంచి ప్రేమకథా చిత్రంలో నటిస్తే చూడాలనుంది బ్రో..

ప్రయత్నిస్తాను.

ఫోన్‌లో డేటా అయిపోయిందా అన్నా..ఇన్నిరోజులూ ఏమైపోయావ్‌?

ఛ ఊర్కో..నేను అప్పుడప్పుడూ చాట్‌ చేస్తుంటాను. ఇప్పుడు కాస్త ఆలస్యం అయినందుకు సారీ. నాకు ఫోన్లు, సోషల్ నెట్‌వర్క్‌ గురించి పెద్దగా తెలీదు.

అన్నా..పెళ్లెప్పుడు?

వచ్చే ఏడాది.


మహేశ్‌ బాబు గురించి ఒక్కమాటలో చెప్పండి?


నేనెప్పుడూ ఆయనకు వీరాభిమానిని.

మహేశ్‌ను ఎప్పుడు కలుస్తారు? ఆయనతో ఓ ఫొటో దిగి పోస్ట్‌ చేయొచ్చు కదా..

నేను కలిశాను. ఫొటో కూడా దిగాను. కానీ పోస్ట్‌ చేయను. షేర్‌ చేయను. అది నేను చనిపోయేవరకు నాతోనే ఉండిపోతుంది. అది నా వ్యక్తిగత విషయం.

రష్మిక మందన గురించి మీ అభిప్రాయం?

ఆమె నటన ఇష్టం. కానీ ఎప్పుడూ కలవలేదు.

మీకు నచ్చిన హిందీ చిత్రం?

వేక్‌ అప్‌ సిడ్‌.

‘మహర్షి’ సినిమాపై మీ అభిప్రాయం?

ఆ సినిమా కోసం నేనూ ఎదురుచూస్తున్నా.

మీ తర్వాతి చిత్రం ఏంటి?

ఆసక్తికరమైన చిత్రంతో మీ ముందుకొస్తా. కాస్త ఓపికపట్టండి. తప్పకుండా సర్‌ప్రైజ్‌ ఇస్తా.

బాలీవుడ్‌లో మీకు నచ్చిన హీరోయిన్‌?

ఆలియా భట్‌.

పూరీ జగన్నాథ్‌తో సినిమా చేస్తారా?

ఆయన్నే అడగండి.

‘పోకిరి’ లాంటి సినిమా చేయన్నా?

‘పోకిరి’ ఒక్కటే సినిమా. ఇంకోటి రాదు రాలేదు.

‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’లో నటిస్తున్నారంట?

నటించాలనే అనుకుంటున్నాను.

నీ ఫేవరెట్‌ క్రికెటర్‌?

సచిన్‌ తెందుల్కర్‌.

అన్నా..నిన్ను చూసి చాలా రోజులు అవుతోంది. ఒక్క ఫొటో పెట్టండి ప్లీజ్‌..

గడ్డం, మీసం పూర్తిగా పెరగని జుట్టుతో ఉన్నా..ఓకేనా?

మీకు ఓటు హక్కు ఎక్కడుంది?

అరె..టికెట్‌ను ఓటును కలపకు. ఎవరి అభిప్రాయాలు వారివి. వదిలెయ్.

కనీసం మీ ట్విటర్‌ ఫొటో అయినా మార్చచ్చు కదా..

ఫొటోగ్రాఫర్‌ రత్నవేలు ఆ ఫొటోను తీశారు. నేనెప్పటికీ దానిని మార్చను. సారీ.

టాలీవుడ్‌లో మీకు నచ్చిన కథానాయిక?

సమంత.

నువ్వింత సన్నగా ఉండటం వెనక రహస్యం?

తెనాలి రామకృష్ణ కథ ఒకటి ఉంటది. అదే.

ఎవరి స్ఫూర్తితో సినిమాల్లోకి రావాలనుకున్నారు?

రాజ్‌ కపూర్‌.

టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలో మీరు కలిసిన బెస్ట్ వ్యక్తి ఎవరు?

రామ్మోహన్‌. ‘ఉయ్యాల జంపాలా’ నిర్మాత.

విజయ్‌ దేవరకొండ గురించి ఒక్కమాటలో చెప్పండి?

ఆయనంటే నాకు చాలా ఇష్టం. ఇండస్ట్రీలో ఇప్పుడున్న నటుల్లో ఆయన ది బెస్ట్‌.

ప్రస్తుతం నీ గర్ల్‌ఫ్రెండ్‌ ఎవరు?

నువ్వు ‘ప్రస్తుతం’ అని అనకపోయి ఉంటే చెప్పేవాడిని.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.