నా బర్త్‌డే స్పెషల్‌ అదే! -మహేష్‌
‘‘సరైన ఆహారం, నిద్ర, సానుకూలంగా ఆలోచించడం, నా కలల్ని సాధించేందుకు వీలుగా నన్ను ఎప్పుడూ ప్రోత్సహించే నా కుటుంబం... ఇవే వయసు పెరుగుతున్నా నేను మరింత అందంగా కనిపించడానికి కారణాలు’’ అంటున్నారు సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు. తాజాగా 43వ జన్మదినాన్ని జరుపుకున్న మహేష్‌.. తన భార్య నమ్రత, పిల్లలు గౌతమ్‌, సితారలతో కలిసి గోవాకు వెళ్లారు. ఈ నేపథ్యంలో ఓ ఆంగ్లపత్రికతో కాసేపు సరదాగా ముచ్చటించారు. ఈ సందర్భంగా వారితో పలు ఆసక్తికర అంశాలు పంచుకున్నాడు మహేష్‌.


* అందుకే ఈసారి విదేశాలకు వెళ్లలేదు!
‘‘నా బర్త్‌డే స్పెషల్‌ అంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండదు. ఆరోజు సాధ్యమైనంత వరకు నేను నా కుటుంబ సభ్యులు, దగ్గరి స్నేహితులతో కలిసి ఉండేలా చూసుకుంటాను. ప్రతిసారి నా పుట్టిన రోజు సందర్భంగా విదేశాలకు వెళ్లే వాళ్లం. కానీ, ఈసారి మా అబ్బాయి గౌతమ్‌కు స్కూల్‌ ఉండటంతో. వాడి చదువుకు ఇబ్బంది ఎందుకని ఎక్కడికీ వెళ్లలేదు’’


* పబ్లిక్‌లో నేనెప్పుడూ ఆగను..
‘‘నేనెప్పుడూ నా కుటుంబంతో కలిసి పబ్లిక్‌లో ఆగను. ఎందుకంటే పబ్లిక్‌లో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంత ఫేం వచ్చిందంటే.. దానికి ఓ కారణం ఉంటుంది. మనం ఆదర్శవంతంగా ఉంటూ, చక్కటి చిత్రాలు తీస్తున్నప్పుడు చుట్టూ ఉన్న వాళ్లు కూడా సంతోషిస్తారు. సౌకర్యంగా ఫీల్‌ అవుతారు. అభిమానులు నా పుట్టిన రోజును ప్రత్యేకంగా చేశారు. ఏదేమైనా నాకు ఇంతమంది శ్రేయోభిలాషులు ఉండటం చాలా సంతోషాన్నిస్తుంది’’


మహేష్‌ ప్రస్తుతం తన 25వ చిత్రం ‘మహర్షి’ కోసం గోవాకు వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడే ‘మహర్షి’ చిత్ర బృందానికి బర్త్‌డే పార్టీ ఇచ్చాడు. తాజాగా దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి.

Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.