ఆ విషయం మీకెలా తెలిసింది?

వరుస అవకాశాలతో దూసుకెళ్తోన్న నాయికల్లో రష్మిక ఒకరు. ‘మీకు అర్థమవుతోందా’ అనే డైలాగుతో చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ ఆకట్టుకుంది. ‘ఛలో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ భామ అనతి కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవలే ‘సరిలేరు నీకెవ్వరు’, ‘భీష్మ’ హిట్‌ చిత్రాలు తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం అల్లు అర్జున్‌ సరసన ‘పుష్ప’లో అవకాశం దక్కించుకుంది. తాజాగా సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో ముచ్చటించిందీ కన్నడ బ్యూటీ. ఆ విశేషాలేంటో చదివేయండి...


* మీకు ఇష్టమైన హీరో ఎవరు? విజయ్‌ దేవరకొండ లేదా నితిన్‌?

రష్మిక:మీకెవరు ఇష్టం?

* హిందీలో నటించే అవకాశాలు ఉన్నాయా? నేను మీకు పెద్ద అభిమానిని.

రష్మిక: ఆలోచిస్తున్న ఎమోజీ షేర్‌ చేశారు.

* మీరు నా కామ్రేడ్‌?

రష్మిక: నాకు నువ్వు కామ్రేడ్.


* నటననే ఎందుకు కెరీర్‌గా ఎంచుకున్నారు?

రష్మిక: ప్రేక్షకుల నవ్వుకు నేను కూడా ఓ కారణంగా కావాలి అనుకున్నా. అది ఒక్క సెకను అయినా చాలు.





* లాక్‌డౌన్‌ను తొలగించిన తర్వాత మీరు చేసే మొదటి పని ఏంటి?

రష్మిక: వెళ్లి నా స్నేహితుల్ని కలుస్తా. వారి జాబితా చాలా పెద్దది.

* మీ పెంపుడు కుక్క పేరు ఏంటి?

రష్మిక: నా దగ్గర ఐదు పెద్ద కుక్కలు, 8 కుక్క పిల్లలు ఉన్నాయి. నీకు ఏ కుక్కపేరు కావాలి? (పగలబడి నవ్వుతూ)

* అంత ఫిట్‌గా ఎలా ఉంటున్నారు?

రష్మిక: పరిస్థితులు ఎలా ఉన్నా, నాకెంత కష్టంగా ఉన్నా వ్యాయామాన్ని మాత్రం వదలను.

* మీరు ఫ్రీగా ఉన్నప్పుడు వంటలు చేస్తారా?

రష్మిక: నేను కేకులు, స్వీట్స్‌ చేస్తా.

* మేం మీ సినిమాల్ని చూస్తున్నట్లే.. మీరు కూడా మీ చిత్రాల్ని చూస్తుంటారా?

రష్మిక: నవ్వొస్తోంది.. నేను ఎక్కువగా టీవీ చూడను. ఇంట్లో నేను చూసుకోవాల్సిన ఆకతాయిలు (పెంపుడు జంతువుల్ని ఉద్దేశిస్తూ) చాలా ఉన్నాయి.






* తమిళ సినిమాలో ఎప్పుడు నటిస్తారు?

రష్మిక: ఇప్పటికే నటించా. ఆ సినిమా ఇంకా విడుదల కాలేదు. కరోనా పూర్తిగా తగ్గిన తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తుందని ఆశిస్తున్నా.

* మీరు హిందీ మాట్లాడతారా?

రష్మిక: మీకేమైనా అనుమానమా?

* మీరు 'పుష్ప' కోసం విభిన్న యాస నేర్చుకుంటున్నారని తెలిసింది. అది నిజమేనా?

రష్మిక: అవును.. అది మీకెలా తెలిసింది? (ఆశ్చర్యపోతున్న ఎమోజీలు)

* ఆ దేవుడు నాకు ఎదురైతే.. నన్ను నీ భర్తను చేయమని అడుగుతా..

రష్మిక: దయచేసి ముందు ఇతడి అనుమతి తీసుకో.. అంటూ తన పెంపుడు కుక్క ఫొటోను షేర్‌ చేశారు.




* మీరు నటి కాకపోయుంటే ఏం అయ్యేవారు?

రష్మిక: బహుశా జీవితాంతం క్వారంటైన్‌లో ఉండేదాన్నేమో.

* వీడియా ద్వారా మీ ఇంటిని మాకు చూపిస్తారా?

రష్మిక: నో.. ఇది నా వ్యక్తిగత ప్రదేశం.

* 'దిల్‌వాలే' సినిమాలో షారుక్‌, కాజోల్‌లా మీరు నాతో ఐదు నిమిషాలు డేట్‌కు వస్తారా?

రష్మిక: నన్ను కాస్త ఆలోచించుకోనివ్వు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.