ఇదొక కొత్త అనుభవం

కొన్ని పాత్రలు నటిస్తున్నకొద్దీ మనసుకు దగ్గరవుతుంటాయి. కొన్ని మాత్రం వినగానే వాటితో ఏదో అనుబంధం ఉన్నట్టుగా అనుభూతికి గురిచేస్తుంటాయి. నేను పోషించిన రుక్సార్‌ పాత్ర రెండో రకానికి చెందిందే.’’ అంటోంది సీరత్‌ కపూర్‌. ఆమె ఓ కథానాయికగా నటించిన చిత్రం ‘కృష్ణ అండ్‌ హిజ్‌ లీల’. సిద్ధు, శ్రద్ధశ్రీనాథ్‌ నటించిన ఆ చిత్రం ఇటీవలే ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా ఆ సినిమాకి లభిస్తున్న ఆదరణ, తన పాత్రకి వస్తున్న గుర్తింపుపై ఆనందం వ్యక్తం చేస్తోంది సీరత్‌ కపూర్‌. ప్రస్తుతం ముంబైలో గడుపుతున్న ఆమె ఫోన్‌లో ‘ఈనాడు సినిమా’తో ముచ్చటించింది.



 ‘‘తెలుగులో నేను నటించిన సినిమాలన్నీ మొదట థియేటర్లలోనే విడుదలయ్యాయి. ‘కృష్ణ అండ్‌ హిజ్‌ లీల’ మాత్రం ఓటీటీలో విడుదలైంది. ఎంతమంది చూస్తారో, ఎలాంటి స్పందన వస్తుందో అని ఆత్రుతగా ఎదురు చూశా. కానీ ఇదొక కొత్త అనుభవాన్నిచ్చింది.’’


 ‘‘కృష్ణ అండ్‌ హిజ్‌ లీల’కి ముందు నేను చేసిన చిత్రం ‘టచ్‌ చేసి చూడు’. నా తదుపరి చిత్రం ‘మా వింతగాథ వినుమా’ త్వరలోనే విడుదలవుతుంది’’.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.