ఆ మధనం వల్లే ‘రంగస్థలం’ని అలా రాశానేమో!
article image‘‘కథ‌లోని నిజా‌య‌తీని రామ్‌చ‌రణ్‌ నమ్మారు.‌ ఆ కథని, మా అందరి కృషినీ ప్రేక్ష‌కులు కూడా నమ్మి ఆద‌రి‌స్తు‌న్నం‌దుకు ఆనం‌దంగా ఉంది’‌’‌ అన్నారు ప్రముఖ దర్శ‌కుడు సుకు‌మార్‌.‌ ఆయన తెర‌కె‌క్కిం‌చిన ‌‘రంగ‌స్థలం’‌ ఇటీ‌వలే ప్రేక్ష‌కుల ముందు‌కొ‌చ్చింది.‌ ఈ సంద‌ర్భంగా శని‌వారం హైద‌రా‌బా‌ద్‌లో సుకు‌మార్‌ విలే‌క‌ర్లతో ముచ్చ‌టిం‌చారు.‌ ఆ విష‌యా‌లివీ.‌.‌.‌

‌‘‌‘సినిమా తొలి ఆట పూర్త‌యి‌న‌ప్పటి నుంచి మా ఫోన్లు అభి‌నం‌ద‌నల వర్షం కురి‌పి‌స్తు‌న్నాయి.‌ తెరపై రామ్‌చ‌ర‌ణ్‌లో చిట్టి‌బాబు మాత్రమే కని‌పిం‌చా‌డనే మాటలు ఎంతో తృప్తి‌ని‌చ్చాయి.‌ సమంత, జగ‌ప‌తి‌బాబు, ఆది పిని‌శెట్టి, ప్రకా‌ష్‌రాజ్, అన‌సూయ ఇలా అందరూ ఆయా పాత్రల్లో జీవిం‌చారు.‌ దేవి‌శ్రీ‌ప్రసాద్, చంద్రబో‌స్‌తో పాటు.‌.‌.‌ సాంకే‌తిక వర్గ‌మంతా కూడా అత్యు‌త్తమ పని‌తీ‌రును కన‌బ‌రి‌చారు.‌ ఈ విజయం అంద‌రిదీ.‌ సిని‌మాకి ప్రేక్ష‌కుల నుంచి వస్తున్న స్పంద‌నని తెలు‌సు‌కొని రామ్‌చ‌రణ్‌ ఐదు నిమి‌షాల పాటు వద‌ల‌కుండా హత్తు‌కొ‌న్నారు.‌ రవి‌తేజ, బన్నీ, క్రిష్, వంశీ పైడి‌పల్లి.‌.‌.‌ ఇలా పలు‌వురు కథా‌నా‌య‌కులు దర్శ‌క‌ని‌ర్మా‌తలు ఫోన్‌ చేసి అభి‌నం‌దిం‌చారు’‌’‌.‌

 ‌‘‌‘నేను చెప్పి‌న‌ట్టు‌గానే కథని తెర‌పైకి తీసు‌కొ‌చ్చి‌న‌ప్ప‌టికీ.‌.‌.‌ 1980ల నాటి ఈ కథని రామ్‌చ‌రణ్‌ వంద శాతం నమ్మడం గొప్ప విషయం.‌ ఇలాంటి పాత్రలో నటిస్తే అభి‌మా‌నులు అంగీ‌క‌రి‌స్తారా? లేదా? అనే భయం లేకుండా అంగీ‌క‌రించి పాత్రలో ఒది‌గి‌పో‌యారు.‌ కథ‌కి‌గానీ, పాత్రల‌కి‌గానీ ప్రత్యే‌కంగా ప్రేరణ అంటూ ఏమీ లేదు.‌ ముందు పతాక సన్ని‌వే‌శాలు తట్టాయి.‌ ఆ తర్వాత ఒకొక్క సన్ని‌వే‌శాన్ని రాసు‌కొన్నా.‌ ఒక‌సారి రచ‌యిత విజ‌యేంద్ర ప్రసా‌ద్‌గా‌రిని కలి‌సి‌న‌ప్పుడు ఆయన తన ‌‘బజ‌రంగి బాయి‌జాన్‌’‌ కథని కేవలం ఇరవై నిమి‌షాల్లో చెప్పే‌శారు.‌ ఇలా నేనెం‌దుకు కథ చెప్ప‌లే‌ననే మధనం నాలో మొద‌లైంది.‌ బహుశా ఆ మధనం, ఆ ప్రయత్నం కార‌ణం‌గానే ఈ కథని నేను తొంద‌రగా రాశా‌నేమో.‌ ‌‘రంగ‌స్థలం’‌ ఊరుని అచ్చు‌గు‌ద్ది‌న‌ట్టుగా రామ‌కృష్ణ, అతని భార్య మోనిక ఆవి‌ష్క‌రిం‌చారు.‌ మొదట్లో ఈ సిని‌మాకి ‌‘రంగ‌స్థలం’‌ పేరు అను‌కో‌లేదు.‌ ఆ పేరుతో పెద్ద బోర్డ్‌ పెట్టి చిత్రీ‌క‌రణ కొన‌సా‌గించాం.‌ ఆ పేరే అంద‌రికీ అల‌వా‌టై‌పో‌యింది.‌ జీవి‌త‌మనే రంగ‌స్థ‌లంలో జరిగే కథే కాబట్టి రామ్‌చ‌రణ్‌ కూడా ఆ పేరే బాటుం‌టుం‌దని చెప్పారు’‌’‌.‌

‘‌‘రంగ‌స్థలం −‌ 2 తీస్తా‌నని కచ్చి‌తంగా చెప్ప‌లేను.‌ తీస్తే తీయొ‌చ్చేమో! ఒక‌వేళ ఆ సినిమా తీస్తే మాత్రం అందులో చిట్టి‌బాబు చెవికి ఆప‌రే‌షన్‌ జరి‌గి‌నట్టు చూపిస్తాం.‌ సీక్వె‌ల్‌గా మాత్రం ఉండదు.‌ కొన్నా‌ళ్ల‌పాటు కుటుం‌బ‌స‌భ్యు‌లతో గడ‌పాలి.‌ ఆ తర్వాతే కొత్త సినిమా.‌

 ‌‘‌‘చిరం‌జీ‌వితో సినిమా తీయడం నా కల.‌ నేను రాసే కథని కూడా చిరం‌జీవి కూడా ఒప్పు‌కొ‌న్నా‌రంటే నా కల నెర‌వే‌రి‌నట్టే.‌ నేనైతే మొదట కథ రాసు‌కో‌వాలి.‌ నా నిర్మాణ సంస్థ సుకు‌మార్‌ రైటిం‌గ్స్‌లో బయటి దర్శ‌కు‌ల‌తోనే సిని‌మాలు చేస్తా.‌ రెండు మూడు కథ‌లైతే సిద్ధంగా ఉన్నాయి’‌’‌.‌


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.