ఇస్మార్ట్‌ సింగర్‌
వేలల్లో సినిమాలు..
లక్షల్లో పాటలు..
వందల్లో గాయకులు..

వాటిలో కొన్ని సినిమాలు చూస్తాం.. ఆ సినిమాల్లోని అన్ని పాటలు వింటాం. ఆ పాటలు అమితంగా నచ్చితే పాడిన వారి వివరాలు సేకరిస్తాం. కొందరి గాయకుల స్వరాన్ని గుర్తుపట్టడం తేలికే. పాట వింటుంటే ఫలానా వాళ్లు పాడారని చెప్పొచ్చు. కానీ, కొందరి గళాన్ని గుర్తుపట్టలేం. ఇలాంటి వాళ్లు పాడిన పాట విని.. ఎవరు పాడారా? అని మ్యూజిక్‌ ప్లేయర్‌లో వివరాలు వెతుకుతాం. దొరక్కపోతే అంతర్జాలంలో అన్వేషిస్తాం. గాయకుల పేరు చూడగానే వీళ్లా పాడింది? అని ఆశ్చర్యానికి గురవుతుంటాం. ఇటీవలే విడుదలైన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ సినిమాలోని టైటిల్‌ గీతాన్ని వింటే ఈ ప్రస్తావన ఎందుకొచ్చిందో అర్థమవుతుంది. ‘గడబిడలకు బేఫికర్‌.. సడక్‌ సడక్‌ కడక్‌ పొగర్‌ ఇస్టైల్‌ దేఖో... నీచే ఊపర్‌’ అంటూ సాగే పాటను ఆలపించిన సింగర్‌ గతంలో ‘చూసి చూడంగానే నచ్చాశావే’, ‘మబ్బులోని వానవెల్లులా.. పిల్లా రా’ లాంటి ఫీల్‌గుడ్‌ పాటలు పాడాడంటే నమ్మగలమా.. తన గాత్రంతో మాయ చేసే ఈ గాయకుణ్ని నమ్మి తీరాల్సిందే. ఆయన ఇంకెవరో కాదు... మాస్, క్లాస్‌ తేడా లేకుండా ఏ పాటైనా ఏక్లాస్‌గా పాడే అనురాగ్‌ కులకర్ణి. జులై 7 తన పుట్టిన రోజు సందర్భంగా ఆయన చేసిన ప్రయాణం ఓ సారి చూద్దాం..

నేపథ్యం:

* 1993, జులై 7న హైదరాబాద్‌లో జన్మించాడు.

* బాల్యంలో హిందూస్థానీ క్లాసికల్‌ మ్యూజిక్‌ నేర్చుకున్నాడు.

* ఇంజినీరింగ్‌లో కంప్యూటర్‌ సైన్సు చదివి కొంతకాలం సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేసి సంగీతంపై మక్కువతో జాబ్‌ వదిలేశాడు. ప్రస్తుతం సింగర్‌గా స్థిరపడ్డాడు.

* వివిధ టీవీ ఛానెల్లో నిర్వహించిన రియాలిటీ షోస్‌లో పాల్గొని రన్నర్‌గా, విన్నర్‌గా నిలిచాడు.

* ‘సప్త స్వరాలు’, ‘ఐడియల్‌ సూపర్‌ సింగర్‌’ సీజన్‌ 8 కార్యక్రమాలతో గుర్తింపు

సినీ ప్రస్థానం:

* నిఖిల్‌ హీరోగా 2015లో వచ్చిన ‘శంకరాభరణం’ సినిమాలోని ‘బన్నో రాణి’ అనే పాటను సహ గాయకుడు రాహుల్‌ సిల్పిగుంజ్‌తో కలిసి పాడాడు. ఇదే ఆయనకు తొలి అవకాశం.

* ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో పాడిన్పటికీ.. 2016లో రామ్‌ సినిమా ‘హైపర్‌’ లోని ‘బేబీ డాల్‌’తో తన ప్రతిభ ఇండస్ట్రీకి తెలిసింది.

* ‘శతమానం భవతి’లోని ‘మెల్లగా తెల్లారిందోయ్‌ ఇలా’ పాటతో మరో మెట్టు ఎక్కాడు.

- ఆ తర్వాత అవకాశాలు వినియోగించుకుంటూ తన వృత్తికి తగిన న్యాయం చేస్తూ పాటలకు ప్రాణం పోశాడు.

గుర్తింపు తెచ్చిన పాటలు:

* కాటమరాయుడు: ‘మిర మిర మీసం’ పాటతో హీరోయిజం చూపించగలిగే పాటలు సైతం పాడగలడని నిరూపించుకున్నాడు.

* పైసా వసూల్‌ : టైటిల్‌ సాంగ్‌ డైలర్‌ మెహందీతో కలిసి ఆయనకు పోటీగా పాడాడు.

* చలో: చూసీ చూడంగానే నచ్చాశావే..

* ‘మహానటి: అభినేత్రి ఓ అభినేత్రి

* ‘ఆర్‌ఎక్స్‌ 100’: పిల్లా రా..

* గీతా గోవిందం: తనే మందే

* కంచరపాలెం: ఆశా పాశం

* శైలజా రెడ్డి అల్లుడు : గోల్డూ రంగు పిల్ల

* దేవదాసు: వారూ వీరూ

* ఇస్మార్ట్‌ శంకర్‌ : ఇస్మార్ట్‌ శంకర్‌

మరికొన్ని:

* విన్నర్‌: సూయ సూయ అనసూయ

* మిస్టర్‌: సయ్యోరే.. సయ్యోరే

* ఫ్యాషన్‌ డిజైనర్‌: కనులేమిటో

* లై: మిస్‌ సన్‌షైన్‌

* ఒక్క క్షణం: గుండెల్లో సూదులు

* పడిపడిలేచే మనసు: కల్లోలం

* దొరసాని: కప్పతల్లి కప్పతల్లి

* మల్లేశం: ఆ చల్లని

* బుర్రకథ: ఒకటే ఒకటేCopyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.