ఆ గళం... అనర్గళం!

బా
లీవుడ్‌ సినీ చరిత్రలో మొట్టమొదటి సూపర్‌స్టార్‌ హోదా ఎవరిదో తెలుసా? అదెవరో నటుడిది కాదు... గాయకుడిది! అతడే కుందన్‌లాల్‌ సైగల్‌. గాంభీర్యం, మాధుర్యం కలగలసిన గానం ఆయనది. ఆయన పాటలు ఈ తరం గాయకులకు ఇప్పటికీ పాఠ్యాంశాలే. పంజాబ్‌లో 1904 ఏప్రిల్‌ 11న పుట్టిన సైగల్, రైల్వే టైమ్‌ కీపర్‌గా, టైప్‌ రైటర్ల సేల్స్‌మేన్‌గా, హోటల్‌ మేనేజర్‌గా రకరకాల పనులు చేస్తూనే గానంలో తన అభిరుచిని మెరుగుపరుచుకున్నారు. అప్పట్లో కోల్‌కతాలో ఉండే సినీ పరిశ్రకు 1930లో పరిచయమై మొదట ‘మొహబ్బత్‌ కే అన్సు’ అనే ఉర్దూ సినిమాతో నేపథ్య గాయకుడిగా మారారు. పలు భాషల్లో విజయవంతమైన చిత్రాల్లో చిరస్మరణీయమైన పాటలు పాడారు. పదిహేను ఏళ్ల పాటు మధుర గాయకుడిగా ముద్ర వేసిన సైగల్‌తన 42వ ఏట 1947 జనవరి 18న మరణించారు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.