సుస్వరాల చక్రి

సంగీత సంచలనం చక్రి. ప్రైవేట్‌ ఆల్బమ్‌లు చేస్తూ చిత్రసీమ దృష్టిని ఆకర్షించిన ఆయన పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహించిన ‘బాచి’తో సంగీత దర్శకుడిగా పరిచయమయ్యారు. అటు మాస్‌ బీట్‌లోనూ... ఇటు మెలోడీలోనూ తన మార్క్‌ని ఆవిష్కరిస్తూ తెలుగు సినిమాని స్వరసంపన్నం చేశాడు. నలభయ్యేళ్ల వయసుకే 85 చిత్రాలకి స్వరాలు సమకూర్చి బోలెడంత కీర్తిని సంపాదించారు. పూరి జగన్నాథ్, వంశీ తదితర అగ్ర దర్శకుల చిత్రాలకి ఎక్కువగా స్వరాలు సమకూర్చిన చక్రి పలువురు గాయకుల్ని పరిశ్రమకి అందించారు. మహబూబాబాద్‌ సమీపంలోని కంబాలపల్లిలో 1974లో జన్మించిన చక్రి 2014 డిసెంబరు 14న మరణించారు. ఆయన చివరిగా ‘ఎర్రబస్‌’, ‘టామీ’, ‘వెన్నెల్లో హాయ్‌ హాయ్‌’ చిత్రాలకి స్వరాలు సమకూర్చారు. ఈరోజు చక్రి జయంతి.

Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.