మహేష్ భట్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సడక్ 2. అలియా భట్ ఆదిత్యరాయ్ కపూర్ నాయికనాయకులుగా నటించిన ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. అయితే ట్రైలర్‌కి 8మిలియన్ల డిజ్‌లైక్‌లు వచ్చినప్పటికీ అలియా భట్ మాత్రం ఓ అరుదైన ఫోటోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. అంతేకాదు ఆ ఫోటోను ఉద్దేశించి ప్రేమ ప్రయాణంలో రెండు హృదయాలు బయలుదేరాయి. అయితే అవి ఎందుకు ఆందోళన చెందుతున్నాయో ..చెప్పిండి అంటూ పేర్కొంది. సినిమాలోని తుమ్ సే హై పాటలో అలియా - ఆదిత్య కపూర్ల కెమిస్ర్టీ చాలా బాగా పండిందని కామెంట్లు కూడా వస్తున్నాయి. షబ్బీర్ అహ్మద్ రాసిన గీతానికి లీనా బోస్ - అంకిత్ గానాలకు అంకిత్ తివారీ స్వరాలు తోడై అలరిస్తుంది ఈ పాట. విశేష్ ఫిల్మ్స్, ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈచిత్రంలో సంజయ్‌దత్, గుల్షన్ గ్రోవర్ మకరంద్ దేశ్‌పాండేలు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 28న డిస్నీ + హాట్‌స్టార్ వీఐపీలో విడుదల కానుంది.