సుస్వరాల మేటి

సాలూరి రాజేశ్వరరావు అంటే ఆయనెవరని అడుగుతారేమో కానీ... కోటి అంటే మాత్రం తెలుగు శ్రోతలు ఇట్టే గుర్తు పట్టేస్తారు. సాలూరి రాజేశ్వరరావు వారసుడైన కోటి మెలోడీ బాణీకి పెట్టని కోట. సుమారుగా 500 చిత్రాలకి స్వరాలు సమకూర్చిన అగ్ర సంగీత దర్శకుడాయన. తెలుగు, తమిళం, కన్నడ పరిశ్రమలకి సుపరిచితుడు. రాజ్‌తో కలిసి రాజ్‌ - కోటి ద్వయంగా దక్షిణాది చిత్ర పరిశ్రమపై తమదైన ముద్ర వేశారు. ప్రముఖ సంగీత దర్శకుడు కె.చక్రవర్తి దగ్గర సహాయకుడిగా ప్రయాణం మొదలుపెట్టిన కోటి విజయవంతమైన ఎన్నో చిత్రాలకి స్వరాలు సమకూర్చారు. ‘హలో బ్రదర్‌’ చిత్రానికి గానూ ఉత్తమ సంగీత దర్శకుడిగా నంది పురస్కారాన్ని సొంతం చేసుకొన్నారు. మణిశర్మ, ఎ.ఆర్‌.రెహమాన్‌ వంటి ప్రముఖ దర్శకులు వాళ్ల కెరీర్‌ ఆరంభంలో కోటి దగ్గర శిష్యరికం చేశారు. కోటికి ఇద్దరు తనయులు. ఒకరు రోషన్, మరొకరు రాజీవ్‌. రోషన్‌ తన తండ్రి బాటలోనే ప్రయాణం చేస్తూ సంగీత దర్శకుడిగా కొనసాగుతున్నారు. రాజీవ్‌ కథానాయకుడిగా కొనసాగుతున్నారు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.