మరువలేని గాయకుడు

తొగులువ మీనాక్షి ఐయ్యంగార్‌ సౌందరరాజన్‌ గొప్ప కర్ణాటిక సంగీతకారుడిగా, సినీగాయకుడిగా ఆరు దశాబ్దాల పాటు ఎన్నో గీతాలు పాడారు. దక్షిణ భారత సినీ దిగ్గజాలైన ఎమ్‌.జి. రామచంద్రన్, ఎన్‌.టి. రామారావు, జెమినీ గణేశన్, అక్కినేని నాగేశ్వరరావు తదితరులతో పాటు, కమలహాసన్, రజనీకాంత్‌ తదితర కథానాయకులకు కూడా గాత్రదానం చేశారు. పదకొండు భాషల్లో పాటు పాడారు. ఆయన సంగీత దర్శకత్వంలో ఎన్నో జనరంజకమైన పాటలు, భక్తిగీతాలు వెలువడ్డాయి. 88 ఏళ్ల వయసులో సుశీలతో కలసి చివరిసారిగా పాడారు. తన 91 ఏళ్ల వయసులో అనారోగ్యంతో చెన్నైలో మరణించారు. 




Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.