అగ్ర రచయితగా ఎదిగి...

నా దారి రహదారి’ అంటూ రజనీకాంత్‌ ‘నరసింహ’లో చేసిన హంగామా ఎప్పటికీ గుర్తుండిపోతుంది. తమిళంలో ‘పడయప్ప’గా తెలుగులో ‘నరసింహ’గా విడుదలై సంచనల విజయం సాధించిందా చిత్రం. ఆ కథ మన తెలుగు రచయిత చిన్నికృష్ణదే. తెనాలిలో పుట్టిపెరిగిన ఆయన భాగ్యరాజాపై ఇష్టంతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. భాగ్యరాజా కథానాయకుడిగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘చిన్నరాజా’ చిత్రం చిన్నికృష్ణని ఎంతో ప్రభావితం చేసిందట. అందుకే ఎలాగైనా భాగ్యరాజాని కలవాలని చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆయన స్ఫూర్తితోనే రచయితగా మారారు. ‘నరసింహ’ తరువాత ‘నరసింహనాయుడు’, ‘ఇంద్ర’, ‘గంగోత్రి’, ‘బద్రీనాథ్‌’, ‘జీనియస్‌’ తదితర చిత్రాలకి కథలు అందించారు చిన్నికృష్ణ. ఆరంభంలోనే వరుస విజయాల్ని అందుకొన్న ఆయన తెలుగులో అగ్ర రచయితగా ఎదిగారు. ఈ మధ్య మాత్రం సరైన విజయాలు లేవు. ఆ మధ్య దర్శకత్వంపై దృష్టిపెడతానని ప్రకటించిన చిన్నికృష్ణ చిత్రాన్ని మాత్రం ఇంకా పట్టాలెక్కించలేదు. ‘గంగోత్రి’ చిత్రంతో హిమాలయాల గొప్పతనాన్ని తెరకు పరిచయం చేసినందుకు గానూ ఆయనకి నేపాల్‌ ప్రభుత్వం ఇండో నేపాల్‌ యూనిటీ పురస్కారాన్ని ప్రదానం చేసింది. ఈ రోజు చిన్నికృష్ణ పుట్టినరోజు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.