కలమే బలంగా ఎదిగి

‘దే
వత’, ‘ఖైదీ నంబర్‌ 786’, ‘అభిలాష’, ‘పోలీస్‌ లాకప్‌’, ‘ఛాలెంజ్‌’ వంటి విజయవంవతమైన చిత్రాలకి కథలందించిన రచయిత జి.సత్యమూర్తి. 1980తో పాటు, 90 దశకంలో వచ్చిన ‘బంగారు బుల్లోడు’, ‘భలే దొంగ’, ‘నారీ నారీ నడుమ మురారి’, ‘అమ్మ దొంగా’, ‘చంటి’, ‘శ్రీనివాసకళ్యాణం’, ‘పెదరాయుడు’, ‘మాతృదేవోభవ’ వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల వెనక సత్యమూర్తి ఉన్నారు. ‘దాదర్‌ ఎక్స్‌ప్రెస్‌’, ‘చైతన్య’ సినిమాలకి దర్శకత్వం కూడా వహించారు. 90కిపైగా సినిమాలకి కథా రచయితగా, మాటల రచయితగా పనిచేశారు. తూర్పు గోదావరి జిల్లా, రాయవరం మండలంలోని వెదురుపాక సత్యమూర్తి స్వస్థలం. 1953 మే 24న జన్మించిన సత్యమూర్తి రామచంద్రపురంలో బీఎస్సీ చేశారు. సాహిత్యం అంటే మక్కువతో ‘చైతన్యం’తో నవలా రచయితగా ప్రయాణం ప్రారంభించారు. పవిత్రులు, పునరంకితం’, ‘ఎదలోయలో నిదురించే’, ‘దిగంబర అంబరం’, ‘అధర గరళం’ వంటి రచనలు చేశారు. మొదట గేయ రచయిత కావాలనుకొన్నారు. ‘దేవత’తో కథారచయితగా పరిచయమయ్యారు. ఆ తర్వాత î ెనుదిరిగి చూడలేదు. చెన్నైలోని సాలిగ్రామంలోనే స్థిరపడిన ఆయన తన 62 యేళ్ల వయసులో 2015లో డిసెంబరు 14న చెన్నైలో తుదిశ్వాస విడిచారు. ఈరోజు ఆయన వర్ధంతి. జి.సత్యమూర్తికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. కుమారులిద్దరూ సంగీత ప్రపంచంలో రాణిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్‌ దక్షిణాదిలో ప్రముఖ సంగీత దర్శకుడిగా కొనసాగుతుండగా, మరో తనయుడు సాగర్‌ గాయకుడిగా రాణిస్తున్నారు.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.