మధురమే ఈ క్షణం.. మధురమే ఈ రణం..
                             

‘‘ఇదిగో 24 ముద్దులు.. నీకో సగం నాకో సగం’’ అంటూ కుర్రకారును కిర్రెక్కించబోతుంది హెబ్బా పటేల్‌. ఈ భామ ముద్దుల ఉత్సవానికి వెండితెర వేదికగా నిలవబోతుంది. మరి ఈ ఉత్సవం సినీ ప్రియులకు ఎలాంటి అనుభూతిని పంచనుందో తెలియాలంటే ‘24 కిస్సెస్‌’ వచ్చేవరకు ఆగాల్సిందే. ‘మిణుగురులు’ చిత్రంతో జాతీయ స్థాయిలో మెరిసిన అయోధ్యకుమార్‌ కృష్ణంశెట్టి.. ఈ సినిమాను తెరకెక్కించారు. హెబ్బా సరసన అరుణ్ అదిత్‌ కథానాయకుడిగా నటించాడు. సిల్లీమాంక్స్‌ సంస్థ నిర్మించగా.. జోయ్‌ బరువా స్వరాలు సమకూర్చాడు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తిచేసుకుంటున్న ఈ చిత్రం నవంబరు 23న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రచార కార్యక్రమాల్ని ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా తాజాగా ‘‘ఈ సమయం.. నా హృదయం’’ వీడియో గీతాన్ని విడుదల చేశారు. పూర్తి రొమాంటిక్‌ కోణంలో సాగిన ఈ పాట.. యువతరాన్ని ఆకట్టుకునే విధంగా రూపొందించారు. రామ జోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం.. వినసొంపుగా సాగుతున్న జోయ్‌ సంగీతం.. హెబ్బా - అరుణ్‌ల కెమిస్ట్రీ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ వీడియో గీతాన్ని చూస్తుంటే దీనికి సినిమాలో ఎంతో ప్రాధాన్యమున్నట్లు అర్థమవుతోంది.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.