ఏయ్‌ పిల్లా.. పరుగున పోదామా

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న చిత్రం ‘లవ్‌స్టోరీ’. శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. నారాయణ్‌ దాస్‌ కె.నారంగ్, పి.రామ్మోహన్‌రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‘ఏయ్‌ పిల్లా... పరుగున పోదామా’ అంటూ సాగే ఈ చిత్రంలోని లిరికల్‌ వీడియో గీతాన్ని విడుదల చేసింది చిత్ర బృందం.హరిచరన్‌ ఆలపించిన ఈ పాట శ్రోతలందరిని అలరిస్తుంది. చైతన్య పింగళి సాహిత్యం అందించగా.. పవన్‌ సి.హెచ్‌ స్వరాలు సమకూర్చారు. గతంలో విడుదల చేసిన ఈ పాటకు సంబంధించిన ప్రోమో విశేష ఆదరణ పొందింది. ‘ఫిదా’ తర్వాత శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రేమకథ ఇది. ఈ వేసవిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. రాజీవ్‌ కనకాల, ఈశ్వరీరావు, దేవయాని తదితరులు నటిస్తున్నారు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.