రొమాంటిక్‌గా ‘రారా ఇటు రారా’ సాంగ్‌

జయం రవి, అరవింద్‌ స్వామి కథానాయకులుగా తెరకెక్కిన తమిళ చిత్రం ‘బోగన్‌’. హన్సిక నాయిక. లక్ష్మణ్‌ దర్శకత్వం వహించారు. అక్కడ మంచి విజయం అందుకున్న ఈ సినిమాను అదే పేరుతో తెలుగు ప్రేక్షకులకు చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు నిర్మాత రామ్‌ తాళ్లూరి. ఎస్‌.ఆర్‌.టి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై తెలుగులో ఈ చిత్రాన్ని అనువదిస్తున్నారు. తాజాగా ‘రారా ఇటు రారా’ అనే రొమాంటిక్‌ గీతాన్ని విడుదల చేసింది చిత్రబృందం. భువన చంద్ర సాహిత్యం అందిచారు. అశ్విన్‌, దీపిక ఆలపించారు. డి. ఇమాన్‌ స్వరాలు సమకూర్చారు. ఈ పాటలో రవి, హన్సిక హావభావాలు ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రానికి కూర్పు: ఆంటోనీ,ఛాయాగ్రహణం: సౌందర్‌ రాజన్‌. త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.