‘బుట్టబొమ్మ’ ఖాతాలో మరో మైలురాయి

అల్లు అర్జున్‌ - త్రివిక్రమ్‌ల కలయికలో వచ్చిన ‘అల.. వైకుంఠపురములో’ చిత్రం విడుదలై ఇప్పటికే మూడు నెలలు గడుస్తున్నా.. నెట్టింట ఆ చిత్ర సందడి ఇంకా కొనసాగుతోంది. ఆ చిత్రంలోని పాటలు యూట్యూబ్‌లో మిలియన్ల కొద్దీ వీక్షణలు దక్కించుకుంటూ కొత్త రికార్డులు నెలకొల్పుతున్నాయి. ముఖ్యంగా ఆ చిత్రంలోని ‘‘బుట్టబొమ్మ..’’ గీతానికి అందులో బన్ని వేసిన స్టెప్పులకు నెట్టింట తెగ ఆదరణ దక్కుతోంది. పలువురు బాలీవుడ్‌ తారలు, క్రికెట్‌ క్రీడాకారులు సైతం ఆ పాటకు తమదైన స్టైల్‌లో స్టెప్పులేసి ముచ్చట తీర్చుకున్నారు. తాజాగా ఈ పాట మరో అరుదైన మైలురాయిని దాటిని. ఈ పాట యూట్యూబ్‌లో విడుదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు దీన్ని దాదాపు 200మిలియన్స్‌ మంది వీక్షించారు. అంటే దాదాపు 20 కోట్ల మంది వీక్షించారన్న మాట. ఇటీవల కాలంలో తెలుగులోనే కాదు.. దక్షిణాదిలోనే ఈస్థాయి ఆదరణ దక్కించుకున్న గీతాల్లో ఒకటిగా నిలిచింది ‘బుట్టబొమ్మ’’ గీతం. ఈ పాటకు తమన్‌ స్వరాలు సమకూర్చగా.. రామజోగయ్య శాస్త్రి సాహిత్యమందించారు. ఆర్మాన్‌ మాలిక్‌ ఆకట్టుకునేలా ఆలపించారు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.