మరో మైలురాయి చేరకున్న బుట్టబొమ్మ పాట

స్టైలీస్‌ స్టార్‌ అల్లు అర్జున్​ త్రివిక్రమ్‌ దర్శకత్వంలో నటించిన చిత్రం 'అల వైకుంఠపురములో'. ఈ సినిమా సంక్రాంతి పండగక్కు వచ్చి బ్లాక్​బాస్టర్​ హిట్​ అందుకుంది. పూజాహెగ్డే కథానాయికగా నటించింది. ముఖ్యంగా ఈ చిత్రం విజయంలో తమన్​ సంగీతం కీలక పాత్ర పోషించింది అని చెప్పడంలో అతియోశక్తి కాదు. యూట్యూబ్​లో ఈ మూవీ సాంగ్స్​ వందల మిలియన్ల వీక్షణలను దక్కించుకొని సత్తా చాటాయి. అయితే ప్రధానంగా 'బుట్టబొమ్మ' అనే పాట విశేష ప్రేక్షకాదరణ పొందింది. అందుకు రుజుగా తాజాగా ఈ పాట మరో అరుదైన మైలురాయిని చేరకుంది. ఇప్పటివరకు ఈ పాటని ఏకంగా 4 కోట్ల వీక్షణలను సాధించి రికార్డు నెలకొల్పింది. రామజోగయ్య కలం నుంచి జాలువారిన ఈ పాటని అర్మాన్‌ మాలిక్‌ ఆలపించగా తమన్ అందించిన సంగీత స్వరాలు పాటకే సరికొత్త అందాలు తెచ్చాయి. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో టబు, నివేదా పేతురాజ్‌, రాజేంద్ర ప్రసాద్‌, సుశాంత్‌, వెన్నెల కిశోర్‌, సునీల్‌, నవదీప్‌ తదితరులు నటించారు. చిత్రానికి ఎస్‌.రాధాకృష్ణ, అల్లు అరవింద్‌ నిర్మాతలు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.