భాస్కరభట్ల కలం నుంచి మరో ప్రేమగీతం జాలువారింది. ‘ఎస్.ఆర్. కల్యాణ మండపం’ చిత్రం కోసం ఆయన రాసిన ‘చుక్కల చున్నీకే నా గుండెని కట్టావే’ పాటని గురువారం విడుదల చేసింది చిత్ర బృందం. కిరణ్ అబ్బవరం, ప్రియాంక జువాల్కర్ జంటగా తెరకెక్కుతోన్న చిత్రమిది. శ్రీధర్ గాదె దర్శకత్వం వహిస్తున్నారు. నాయకానాయికల హావభావాలు అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా ఉన్నాయి. చక్కటి ఈ సాహిత్యానికి చైతన్య భరద్వాజ్ స్వరాలు సమకూర్చారు. శ్రావ్యమైన గానంతో ఆలపించి శ్రోతలు మళ్లీ మళ్లీ వినేలా చేస్తున్నారు గాయకుడు అనురాగ్ కులకర్ణి. ఎలైట్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ప్రమోద్, రాజు నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుందీ చిత్రం.