కన్నీళ్లు కొన్నేళ్లుగా.. రానన్న రాలేదుగా

సుహాస్‌, చాందినీ చౌదరి జంటగా తెరకెక్కిన చిత్రం ‘కలర్‌ ఫోటో’. సందీప్‌ రాజ్‌ దర్శకుడు. తాజాగా ఈ చిత్రంలోని ‘ఏకాంతం లేనే లేదు’ అనే పాటను విడుదల చేశారు. కృష్ణ చైతన్య సాహిత్యం అందిచారు. కాల భైరవ సంగీత సారథ్యంలో రమ్య బెహర ఆలపించారు ఈ గీతాన్ని. కథానాయిక బాధ పడే సన్నివేశంలో వచ్చే పాటలా ఉంది లిరిక్స్‌ చూస్తుంటే. రమ్య గానం శ్రోతలందరిని అలరిస్తుంది. బెన్నీ ముప్పనేని నిర్మించిని ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబరు 23న ఆహా ప్లాట్‌ఫామ్‌పై విడుదల కాబోతుంది. ఈ చిత్రంలో సునీల్‌ కీలక పాత్రలో నటించారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌ సినిమాపై అంచనాలు పెంచుతోంది.
Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.