కళ్లతో ఎన్నెన్ని భావోద్వేగాలు పలికిస్తుందో చూశారా!!

‘‘ఉద్యమంలో చావు కూడా ఓ విజయం. కానీ, ఇక్కడ మా ప్రేమ కూడా ఓ ఉద్యమమే’’ అంటున్నారు ఆనంద్‌ దేవరకొండ - శివాత్మిక రాజశేఖర్‌. ప్రస్తుతం వీళ్లిద్దరినీ నాయకానాయికలుగా పరిచయం చేస్తూ.. నూతన దర్శకుడు కేవీఆర్‌ మహేంద్ర తెరకెక్కించిన చిత్రం ‘దొరసాని’. మధుర ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేష్‌ ప్రొడక్షన్స్, బిగ్‌బెన్‌ సినిమాస్‌ సంయుక్తంగా నిర్మించాయి. జులై 12 ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో.. చిత్ర ప్రచారంలో భాగంగా ‘‘కళ్లలో కలవరమై’’ వీడియో గీతాన్ని విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పాటకు నెట్టింట మంచి ఆదరణ లభిస్తోంది. ఆనంద్‌ - శివాత్మికల జోడీ ఎంతో చూడముచ్చటగా ఉందని, ప్రత్యేకించి శివాత్మిక కళ్లతోనే చక్కగా భావోద్వేగాలు పలికిస్తున్న తీరు అద్భుతంగా ఉందని నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. ఈ పాటకు ప్రశాంత్‌ ఆర్‌ విహారి సమకూర్చిన స్వరాలు.. శ్రేష్ఠ ఇచ్చిన సాహిత్యం.. దాన్ని ఎంతో అద్భుతంగా చిన్మయి తన గళంలో వినిపించిన విధానం ప్రధాన ఆకర్షణలుగా నిలిచాయి.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.