అదరగొడుతున్న ‘దర్బార్‌’ సాంగ్‌

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఆయన కథానాయకుడిగా తెరకెక్కిన 'దర్బార్‌' సినిమా ఫస్ట్‌ సాంగ్‌ను చిత్రబృందం బుధవారం సోషల్‌మీడియా వేదికగా విడుదల చేసింది. 'దుమ్మూ దూళి' అంటూ సాగే ఈ పాటను ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలు పాడారు. అనిరుధ్‌ అందించిన సంగీతం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. మురుగదాస్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రజనీకాంత్‌ ఆదిత్య అరుణాచలం అనే పోలీస్‌ అధికారి పాత్రలో నటించారు. నయనతార కథానాయిక. నివేదా థామస్‌, ప్రకాశ్‌రాజ్‌, యోగిబాబు, మనోబాలా, సుమన్‌, హరీష్‌ ఉత్తమన్‌, ఆనంద్‌రాజ్‌, శ్రీమన్‌లు కీలకపాత్రలు పోషించారు. కొన్నిరోజుల క్రితం షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు ఇటీవల డబ్బింగ్‌ పనులు జరుగుతున్నాయి. తన సన్నివేశాలకు రజనీకాంత్‌ డబ్బింగ్‌ చెబుతున్న ఫొటోలను చిత్రబృందం విడుదల చేసిన విషయం తెలిసిందే.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.