విశ్వకార్తికేయ, దీప ఉమావతి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘కళా పోషకులు’. చలపతి పువ్వల దర్శకుడు. శ్రీ వెన్నెల క్రియేషన్స్ పతాకంపై సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇటీవలే చిత్రీకరణ పూర్తిచేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాలోని ‘ఏలేలే ఏలే’ అనే పాటకు సంబంధించిన లిరికల్ వీడియోను ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ విడుదల చేశారు. హరిదేవ్ సాహిత్యం అందించగా రాహు్ సిప్లిగంజ్ ఆలపించాడు. ఎలెందర్ మహావీర్ సంగీత సారథ్యం వహించారు. విడుదల సందర్భంగా ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ.. ‘కళాపోషకులు టైటిల్ చాలా ఆసక్తిగా ఉంది. టీజర్ బావుంది. ఈ పాట శ్రోతల్ని తప్పకుండా అలరిస్తుంది. హరిదేవ్ సాహిత్యం, రాహుల్ గానం, ఎలెందర్ సంగీతం అద్భుతంగా ఉన్నాయి. దర్శకుడు చలపతి నాకు తెలిసిన వ్యక్తే. సినిమా విజవంతమై చిత్రబృందానికి మంచి పేరు తీసుకు రావాలన్నా’రు. ‘నిర్మాత సుధాకర్ రెడ్డి గారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను నిర్మించడం వల్లే ఔట్పుట్ ఇంతబాగా వచ్చింది. విశ్వకార్తికేయ మొదటి సినిమా అయినా చాలా బాగా నటించార’ని తెలిపారు దర్శకుడు చలపతి.