రవితేజ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన చిత్రం ‘రాజాద ది గ్రేట్’. ఈ సినిమాలో రవితేజ కళ్లులేని వాడి పాత్రలో నటించి అలరించారు. కథానాయికగా మెహ్రీన్ పీర్జాదా నటించగా శ్రీనివాసరెడ్డి హాస్యనటుడిగా రాణించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై నిర్మితమైన ఈ చిత్రంలోని అన్ని పాటలు అలరించి మెప్పించాయి. అయితే వాటిలో గున్నా గున్నా మామిడి అనే పాట అటు గ్రామీణ ప్రాంతాల్లోనూ యువతను బాగా ఆకట్టుకుంది. తాజాగా ఈ పాట యూట్యూబ్‌లో 100 మిలియన్ల వ్యూస్‌ని సాధించి అదరహో అనిపించింది. చిత్రంలో రాధిక, ప్రకాష్‌రాజ్, రాజేంద్ర ప్రసాద్‌తో పాటు ఇంకా ఎంతో క్యారక్టర్, హాస్యనటులు నటించి మెప్పించారు. ఇందులో ప్రతినాయకుడిగా వివాన్ భతేనా నటన ఆకట్టుకుందని చెప్పవచ్చు.