‘వెంటాడే గాయం’ ఫుల్‌ వీడియో

విశ్వక్‌ సేన్‌ కథానాయకుడుగా తెరకెక్కిన చిత్రం ‘హిట్‌’. ‘ది ఫస్ట్‌ కేస్‌’ అనేది ఉపశీర్షిక. రుహాని శర్మ నాయిక. శైలేష్‌ కొలను దర్శకత్వం వహించారు. థ్రిల్లర్‌ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా మంచి విజయం అందుకుంది. తాజాగా ఈ సినిమాలోని ‘వెంటాడే గాయం’ పాట విడుదలైంది. కథలో సందర్భాన్ని తెలియజేసే గీతమిది. వేటాడే గాయం చేశానో నేరం.. ప్రశాంతం కోసం పోవాలో ఏ దూరం అంటూ మెల్లగా శ్రోతల్ని ఆకట్టుకుంటుంది. ఆద్యంతం ఆసక్తిగా సాగుతూ అలరిస్తోంది. ఇందులో విశ్వక్‌ హావభావాలు ఆసక్తిరేపుతున్నాయి. టెన్షన్‌ పడుతూ కనిపించి ఏమైందో తెలుసుకోవాలనే ఉత్కంఠ పెంచుతున్నాడు. కృష్ణకాంత్‌ సాహిత్యం అందించగా మోహన భోగరాజు ఆలపించింది. ఈమె గాత్రం పాటకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. వివేక్‌ సాగర్‌ స్వరాలు సమకూర్చారు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.