బల్కంపేట్‌ ఎల్లమ్మవే.. బంగారు మైసమ్మవే..

యువ కథానాయకుడు రామ్‌ ప్రస్తుతం నటించిన చిత్రం ‘ఇస్మార్ట్‌ శంకర్‌’. ఈ సినిమాలోని ఓ పాటకు సంబంధించిన లిరికల్‌ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. బోనాలు నేపథ్యంలో వచ్చే పాట ఇది. ‘నీ ముక్కు పోగు మెరుపులోన.. పొద్దు పొడిసే తూరుపులోన’ అంటూ సాగే ఈ పాటను కాసర్ల శ్యాం రచించారు. మణిశర్మ సంగీత సారథ్యంలో రాహుల్‌ సిల్పిగంజ్, మోహన భోగరాజు ఆలపించారు. ప్రస్తుతం హైదరాబాద్‌ నగరంలో బోనాల సీజన్‌ నడుస్తోంది. ఈ తరుణంలో బోనాల పాటలకు విపరీతమైన క్రేజ్‌ ఉంటుంది. అలాంటి సందర్భంలో ఈ సాంగ్‌ విడుదలవడంతో అందరిని అలరిస్తుంది. పూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా జులై 18న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.