సిలక సితరాంగి సిలక

రామ్‌ కథానాయకుడిగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఇస్మార్ట్‌ శంకర్‌’. డబుల్‌ దిమాక్‌ హైదరాబాదీ... అనేది ఉపశీర్షిక. నిధి అగర్వాల్, నభా నటేష్‌ కథానాయికలు. పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. లావణ్య సమర్పిస్తున్నారు. జులై 12న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. శుక్రవారం చిత్రంలోని దిమాక్‌ ఖరాబ్‌... పాటని విడుదల చేశారు. ‘సిలక సిలక సిలక సితరాంగి సిలక... పిలగ పిలగ పిలగా పెట్టిపోరా సురక...’ అంటూ సాగే ఈ పాటకి మణిశర్మ స్వరాలు సమకూర్చగా, కాసర్ల శ్యాం సాహిత్యం అందించారు. పూరి జగన్నాథ్‌ శైలి మాస్‌ అంశాలతో రూపుదిద్దుకొన్న చిత్రమిది. హైదరాబాదీ కుర్రాడిగా రామ్‌ పక్కా మాస్‌ పాత్రలో నటించారు. మూడు పాటలు మినహా చిత్రీకరణ పూర్తయింది. పునీత్‌ ఇస్సార్, సత్యదేవ్, ఆశిష విద్యార్థి, గెటప్‌ శ్రీను, సుధాంశు పాండే తదితరులు నటించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: రాజ్‌ తోట.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.