ఈ నేల తడబడే.. వరాల ఒరవడే

కిరణ్‌ అబ్బవరం, ప్రియాంక జువాల్కర్‌ జంటగా నటించిన చిత్రం ‘ఎస్‌.ఆర్‌.కల్యాణ మండపం’. శ్రీధర్‌ గాదె దర్శకుడు. ఎలైట్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ప్రమోద్, రాజు నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలోని మొదటి గీతాన్ని కథానాయకుడు నిఖిల్‌ విడుదల చేశారు. ‘ఈ నేల తడబడే.. వరాల ఒరవడే’ అంటూ సాగే ఈ పాట శ్రోతల్ని అలరిస్తుంది. కృష్ణకాంత్‌ సాహిత్యం అందించిన ఈ గీతాన్ని సిద్‌ శ్రీరామ్‌ ఆలపించారు. చేతన్‌ భరద్వాజ్‌ స్వరాలు సమకూర్చారు. ఈ లిరికల్‌ వీడియోలో నాయకానాయిక హావభావాలు అలరిస్తున్నాయి. చిత్రీకరణ పూర్తి చేసుకుని ఈ ప్రేమ కథ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.