డీజే కాదు ఇది ఓజే!

ప్రస్తుతం డీజే గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సింది ఏముంది. చిన్నా పెద్దా అంతా కలిసి చిందులేయాలంటే డీజే పెట్టాల్సిందే కదా. ఇది ఓకే ఇంతకీ ఓజే ఏంటి? అనుకుంటున్నారా. అయితే రామజోగయ్య శాస్త్రి రచించిన ‘భూమ్‌ బద్దలు’ పాట వినాల్సిందే. ‘క్రాక్’ సినిమా కోసం ఈ ప్రయోగం చేశారాయన. తనదైన శైలిలో మాస్‌ మసాలా గీతాన్ని సంగీతం ప్రపంచలోకి దీపావళి కానుకగా విడుదల చేశారు. రవితేజ, శ్రుతిహాసన్‌ జంటగా గోపీచంద్‌ మలినేని తెరకెక్కించిన చిత్రం ‘క్రాక్‌’. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతుంది. ఇందులో పోలీసు అధికారిగా నటిస్తున్నారు రవితేజ. తెరపై (కథానాయకులు) పోలీసులు అనుమానితుల్ని, హంతకుల్ని పట్టుకునే ప్రయత్నంలో ఓ ఐటెమ్‌ సాంగ్‌లో ఆడిపాడే సందర్భాలు చాలా చూశాం. ఈ సినిమాలోనూ అదే అయి ఉండొచ్చు. అభిమానుల్లో జోష్‌ నింపేందుకు అప్సర రాణిని ఎంపిక చేసింది చిత్రబృందం. బీట్‌కి తగినట్టు రవితేజ, అప్సర నర్తించి అదరగొడుతున్నారు. తమన్‌ స్వరాలు సమకూర్చగా మంగ్లీ, సింహా, శ్రీ కృష్ణ ఆలపించారు. సరస్వతి ఫిల్స్మ్‌ డివిజన్‌ పతాకంపై బి.మధు నిర్మించారు. తుది దశ చిత్రీకరణలో ఉన్న ఈ చిత్రం 2021 సంక్రాంతికి రాబోతుంది. ఓజే అంటే... ఒంగోలు జాతర.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.