‘ది ఔరా ఆఫ్‌ రిషి’ వచ్చేసింది..

‘‘నువ్వే సమస్తం.. నువ్వే సిద్ధాంతం’’ అంటూ ‘మహర్షి’ నుంచి మరో గీతాన్ని విడుదల చేసింది చిత్ర బృందం. ‘ది ఔరా ఆఫ్‌ రిషి’ పేరుతో ఈ రెండవ పాటను బయటకొదిలారు. ‘‘నువ్వే సమస్తం.. నువ్వే సిద్ధాంతం.. నువ్వే నీ పంతం.. నువ్వేలే అనంతం’’ అంటూ పవర్‌ఫుల్‌ పదాలతో మహర్షిలోని హీరోయిజాన్ని ఎలివేట్‌ చేస్తూ ఈ పాట సాగుతోంది. దీనికి తగ్గట్లుగానే విజువల్స్‌లో మహేష్‌ బిజినెస్‌మేన్‌లా హెలికాఫ్టర్‌లోని నుంచి దిగి స్టైలిష్‌గా నడుస్తూ వస్తుండటం, ఆఫీస్‌లో కూర్చొని కనిపిస్తుండటం హైలైట్‌గా అనిపిస్తోంది. ఇది ఒకరకంగా సినిమాకు టైటిల్‌ గీతమనుకోవచ్చు. ఈ చక్కని గీతానికి శ్రీమణి సాహిత్యం అందించగా.. దేవిశ్రీప్రసాద్‌ స్వరాలు సమకూర్చారు. మహేష్‌బాబు కథానాయకుడిగా నటించిన 25వ చిత్రమిది. ఆయనకు జోడీగా పూజాహెగ్డే కనిపించబోతుండగా.. అల్లరి నరేష్‌ ఆయన స్నేహితుడిగా నటిస్తున్నారు. వంశీపైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని దిల్‌రాజు, పీవీపీ, అశ్వనీదత్‌ సంయుక్తంగా నిర్మించారు. మే 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.