మదిని హత్తుకుంటున్న ‘ద సోల్‌ ఆఫ్‌ రిషి’
‘మహర్షి’ విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రచార కార్యక్రమాల్ని ముమ్మరం చేస్తోంది చిత్ర బృందం. ఇప్పటికే ట్రైలర్, పాటలు బయటకొదలగా.. ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ‘ద సోల్‌ ఆఫ్‌ రిషి’ పేరుతో మరో గీతాన్ని విడుదల చేశారు. ‘‘ఇదే కదా నీ కథా’’ అంటూ మనసులను హత్తుకునేలా సాగుతున్న ఈ గీతానికి శ్రీమణి సాహిత్యమందించగా.. విజయ్‌ ప్రకాశ్‌ ఎంతో చక్కగా ఆలపించారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూర్చారు.


* ‘మహర్షి’ నిడివి ఎక్కువే...
మహేష్‌ కథానాయకుడిగా నటిస్తోన్న ‘మహర్షి’ తాజాగా సెన్సార్‌ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. ఒక్క కట్‌ కూడా చెప్పకుండా ఈ సినిమాకు యూ-ఏ సర్టిఫికెట్‌ ఇచ్చింది సెన్సార్‌ బోర్డు. ఈ సందర్భంగా చిత్ర రన్‌ టైం ఎంతన్నదీ తెలిసిపోయింది. ‘మహర్షి’ దాదాపుగా 175 నిమిషాల నిడివితో ప్రేక్షకుల్ని పలకరించబోతుందట. అంటే 5 నిమిషాల తక్కువ మూడు గంటలన్న మాట. మహేష్‌ ఈ చిత్రంలో మూడు భిన్నమైన లుక్స్‌లో కనిపించబోతున్నాడు. ఆయనకు జోడీగా పూజా హెగ్డే నటిస్తుండగా.. అల్లరి నరేష్‌ కీలక పాత్రను పోషిస్తున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. దిల్‌రాజు, అశ్వినీదత్, పీవీపీ సంయుక్తంగా నిర్మించారు.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.