సేద్యం కోసం స్వేదం చిందించి


చిత్రం
: మహర్షి

రచన: శ్రీమణి
గానం: శంకర్‌ మహదేవన్‌
సంగీతం: దేవిశ్రీప్రసాద్‌

సాకీ: భళ్ళుమంటూ నింగి ఒళ్ళు విరిగెను
గడ్డి పరకతోన
ఎడారి కళ్ళు తెరుచుకున్న వేళన చినుకుపూల వాన
సముద్రమెంత దాహమేస్తె వెతికెను
ఊట బావినే
శిరస్సు వంచి శిఖరమంచు ముద్దిడే మట్టినేలనే
పల్లవి: పదరా పదరా పదరా
నీ అడుగుకి పదును పెట్టి పదరా
ఈ అడవిని చదును చెయ్యి మరి
వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా
పదరా పదరా పదరా ఈ పుడమిని అడిగి చూడు పదరా
ఈ గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికి సమాధానమిదిరా
నీ కథ ఇదిరా నీ మొదలిదిరా
ఈ పథమున మొదటడుగైరా
నీ తరమిదిరా అనితరమిదిరా
అని చాటై రా

చరణం: 1

కదిలే ఈ కాలం తన రగిలే వేదనకి
బదులల్లే విసిరిన ఆశల బాణం నువ్వేరా
పగిలే ఇల హృదయం తన ఎదలో రోదనకి
వరమల్లే దొరికిన ఆఖరి సాయం నువ్వేరా..
కను రెప్పలలో తడి ఎందుకని
తననడిగే వాడే లేక
విలపించేటి ఈ భూమి ఒడి చిగురించేలా
పదరా పదరా పదరా ఈ హలమును భుజముకెత్తి పదరా
ఈ నేలను ఎదకు హత్తుకుని
మొలకలెత్తమని పిలుపునిచ్చి పదరా
పదరా పదరా పదరా
ఈ వెలుగను పలుగు దించి పదరా
పగుళ్లతో పనికి రానిదను బ్రతుకు భూములిక మెతుకులిచ్చు కదరా

చరణం: 2

నీలో ఈ చలనం మరి కాదా సంచలనం
చినుకల్లే మొదలై ఉప్పెన కాదా ఈ కథనం
నీలో ఈ జడికి చెలరేగే అలజడికి
గెలుపల్లే మొదలై చరితగ మారే నీ పయనం
నీ ఆశయమే తమ ఆశ అని
తమ కోసమని తెలిశాక
నువ్వు లక్ష్యమని తమ రక్షవని నినదించేలా
పదరా పదరా పదరా
నీ గతముకు కొత్త జననమిదిరా
నీ ఎత్తుకు తగిన లోతు ఇది
తొలి పునాది గది తలుపు తెరిచి పదరా
పదరా పదరా పదరా
ప్రతొక్కరి కథవు నువ్వు కథరా
నీ ఒరవడి భవిత కలల ఒడి
బ్రతుకు సాధ్యపడు సాగుబడికి బడిరా
సాకీ: తనని తాను తెలుసుకున్న హలముకు
పొలముతో ప్రయాణం
తనలోని ఋషిని వెలికితీయు
మనిషికి లేదు ఏ ప్రమాణం
ఉషస్సు ఎంత ఊపిరిచ్చి
పెంచిన కాంతిచుక్కవో
తరాల వెలితి వెతికి తీర్చ వచ్చిన
వెలుగు రేఖవోCopyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.