అదరగొడుతున్న ‘మాస్టర్‌’ సాంగ్‌
అనిరుధ్‌ సంగీత సారథ్యంలో మరో హుషారెత్తించే పాట ప్రాణం పోసుకుంది. ‘కుట్టి స్టోరీ’ అంటూ సాగే పాట విడుదలైన కొన్ని క్షణాల్లోనే శ్రోతల్ని విపరీతంగా అలరిస్తుంది. తమిళ నటుడు విజయ్‌ నటిస్తున్న ‘మాస్టర్‌’ చిత్రంలోని పాట ఇది. విజయ్, అనిరుధ్‌ ఆలపించడటంతో మరోస్థాయికి చేరింది. అరుణ్‌ రాజా కామరాజ్‌ సాహిత్యం అందించారు. అధిక శాతం ఇంగ్లిష్‌లోనే రచించారు. దాంతో భాషతో సంబంధం లేకుండా అందరిని ఆకట్టుకుంటుంది. లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో విజయ్‌ సరసన మాళవిక మోహన్‌ నటిస్తుంది. విజయ్‌ సేతుపతి కీలక పాత్రలో పోషిస్తున్నాడు. ఈ వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.