‘మదర్స్‌ డే’ సర్‌ప్రైజ్‌ ఇచ్చిన అనసూయ

‘క్షణం’, ‘రంగస్థలం’, ‘యాత్ర’ వంటి చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలతో అలరించిన అనసూయ భరద్వాజ్‌.. ఇప్పుడు ‘కథనం’ అనే మరో విభిన్నమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రాజేశ్‌ నాదేండ్ల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ఆమె ఓ దర్శకురాలిగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అవసరాల శ్రీనివాస్, ధనరాజ్‌ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈరోజు మాతృదినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ చిత్రంలోని తొలి పాట లిరికల్‌ వీడియోను అనసూయ ట్విటర్‌ వేదికగా విడుదల చేశారు. ‘చీకటి కొండల్లోనా తూర్పు నువ్వేనమ్మా.. గుడిసె గుండెల్లోనా మెరుపు నువ్వేనమ్మా.. పిలవగానే పలుకుతావే మాకోసమొచ్చిన దేవత’ అంటూ సాగుతున్న ఈ పాట ఎంతో వినసొంపుగా ఉంది. రోషన్‌ సాలూరు ఈ సినిమాకు సంగీతం అందించారు. రెహమాన్‌ సాహిత్యం అందించిన ఈ పాటను కాల భైరవ ఆలపించారు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.