పాటల పల్లకీతో.. ‘మిస్టర్‌ మజ్ను’..

అఖిల్‌ - నిధి అగర్వాల్‌ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మిస్టర్‌ మజ్ను’. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ చిత్రం రిపబ్లిక్‌ డే కానుకగా జనవరి 25న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రచారాన్ని షురూ చేశారు. ఇందులో భాగంగా సినిమాలోని అన్ని పాటలను విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ సినిమా జూక్‌ బాక్స్‌ను 14న ఉదయం 10 గంటలకు విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. దీనికి సంబంధించి ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. ఈ ప్రచార చిత్రంలో అఖిల్‌.. షారుఖ్‌ స్టైల్‌లో రెండు చేతులూ పైకెత్తి తలవంచి నవ్వుతూ కనిపిస్తున్నాడు. ఈ సినిమాకు తమన్‌ స్వరాలు సమకూరుస్తున్నాడు.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.