‘అల్లుడు’ మెలొడీ విన్నారా..!

‘ఓలా చికా’, ‘పిల్లడూ అదుర్స్‌.. గిల్లుడు అదుర్స్‌’ అంటూ హుషారైన పాటలు వినిపిస్తూనే ‘పడిపోయా’ అనే ప్రేమగీతాన్ని అందించాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌. తాజాగా మరో మెలొడీ విడుదలైంది. ‘నదిలా నదిలా’ అంటూ సాగే ఈ పాట ఆద్యంతం అలరిస్తుంది. శ్రీమణి సాహిత్యం అందించగా సాగర్‌, హరిప్రియ ఆలపించారు. దేవీశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చారు. ‘అల్లుడు అదుర్స్‌’ చిత్రంలోని గీతమిది. సంతోష్‌ శ్రీనివాస్‌ తెరకెక్కించిన ఈ చిత్రంలో సాయి శ్రీనివాస్ సరసన నభా నటేష్‌ , అను ఇమ్మాన్యుయేల్ నటించారు. గొర్రెల సత్యనారాయణ నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లకి రాబోతున్నాడీ అల్లుడు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.