‘రాయే నువ్వు రాయే’
సాధారణంగా అమ్మాయిలు గొడవలకు దూరంగా ఉంటారు. తను ప్రేమించిన అబ్బాయి ఎవరితోనైనా కొట్లాటకు దిగితే అసలు తట్టుకోలేరు. కానీ వాణి మాత్రం రోజూ గొడవలు చూపిస్తావా? అని పోతురాజుని అడుగుతుంది. అడగటమే ఆలస్యం ఒకటేంటి రోజులు వంద చూపిస్తా అని కాలర్‌ ఎగరేస్తాడు పోతురాజు. ఈ సందర్భంలో వాళ్ల మధ్య చిగురించే ప్రేమని పాట రూపంలో చెప్పే ప్రయత్నం చేశారు రచయిత కిట్టు విస్సాప్రగడ. ‘రాయే నువ్వు రాయే సందుల్లో .. గొడవల్లో’ అంటూ సాగే ఈ గీతం ‘బొమ్మ బ్లాస్టర్‌’ చిత్రంలోది. నందు, రష్మి జంటగా నటించారు. రాజ్‌ విరాట్‌ దర్శకుడు. పూరి జగన్నాథ్‌ అభిమాని పోతురాజుగా కనిపించనున్నాడు నందు. ఆయన ప్రేమసి వాణి పాత్ర పోషించింది రష్మిక. తాజాగా ఈ గీతాన్ని హీరో వరుణ్‌ తేజ్‌ సామాజిక మాధ్యమాల వేదికగా విడుదల చేశారు. ప్రశాంత్‌ విహారి స్వరాలు సమకూర్చగా ముహీత్‌ భర్తి, మిర్యాల రామ్‌, మనీషా ఆలపించారు. సరికొత్త పంథాలో రూపొందిన ఈ పాట అన్ని వర్గాల శ్రోతల్ని అలరిస్తుంది.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.