‘జెర్సీ’ నుంచి మరో పాట

నాని కథానాయకుడిగా గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘జెర్సీ’. రంజీ క్రికెట్‌ నేపథ్యంలో సాగే ఈ కథలో నాని క్రికెటర్‌గా కనిపించనున్నారు. ఇందులో కథానాయికగా శ్రద్ధా శ్రీనాథ్‌ నటిస్తుంది. ఈ సినిమా నుంచి ఒక లిరికల్‌ వీడియో పాటనును విడుదల చేశారు. ఆ పాటేంటంటే...‘‘అదేంటోగాని ఉన్నపాటుగా .. అమ్మాయి ముక్కుమీద నేరుగా .. తరాలనాటి కోపమంత ఆ ఎరుపేగా .. నాకంటూ ఒక్కరైనా లేరుగా .. నన్నంటుకున్న తారవే నువ్వా .. నాకున్న చిన్ని లోకమంత నీ పిలుపేగా...’’ సాగుతోంది పాట. ఇంకా ఈ సినిమాలో సత్యరాజ్, బ్రహ్మాజి, సుబ్బరాజు రాహుల రామకృష్ణ తదితరులు నటిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి సూర్యదేవర నాగవంశీ నిర్మాత. అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్‌ 19, 2019న ప్రేక్షకుల ముందుకు రానుంది.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.