అలరిస్తోన్న ‘బేబీ టచ్‌ మీ’ సాంగ్‌

నాని, సుధీర్‌ బాబు కలిసి నటించిన చిత్రం ‘వి’. మోహన్‌ కృష్ణ ఇంద్రగంటి దర్శకుడు. నివేదా థామస్, అతిథిరావు హైదరి నాయికలు. తాజాగా ఈ చిత్రంలోని ‘బేబీ టచ్‌ మీ నౌ’ అనే గీతం విడుదలైంది. పార్టీకి సంబంధించిన సాంగ్‌ ఇది. సుధీర్‌ బాబు, నివేదాపై చిత్రీకరించారు ఈ గీతాన్ని. అమిత్‌ త్రివేది అందించిన సంగీతం శ్రోతల్ని అమితంగా ఆకట్టుకుంటుంది. సుధీర్, నివేదా స్టెప్పులు కనువిందు చేస్తున్నాయి. కృష్ణకాంత్‌ సాహిత్యం అందించగా షర్వి యాదవ్‌ ఆలపించారు. దిల్‌ రాజు నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబరు 5న అమేజాన్‌ ప్రైమ్‌లో విడుదల కాబోతుంది. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్‌ చిత్రంపై అంచనాలు పెంచుతున్నాయి.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.