హిందీ ఖవ్వాలీ తెలుగు బజారు పాటగా...

article imageచిత్రం:‌ రాజశ్రీ ప్రొడక్షన్స్‌ వారి ‌‘శభాష్‌ రాజా’‌ (09−‌11−‌1961)
గీత రచన:‌ కొస‌రాజు రాఘ‌వయ్య చౌదరి
గానం:‌ పి.‌సుశీల
సంగీతం:‌ ఘంట‌సాల
అభి‌నయం:‌ రాజ‌సు‌లో‌చన, అక్కి‌నేని

లోకాన దొంగలు వేరే లేరయ్యా.‌.‌.‌ దూరానా ఎక్క‌ణ్ణుంచో రారయ్యా ||2‌||
కళ్లల్లో కారం‌గొట్టి, మాటల్తో మస్కా‌గొట్టి
కత్తెర దొంగలు వేరే లేరయ్యా ||‌లో‌కా‌న‌||

దొంగల్లో దొర‌లు‌న్నారూ.‌.‌.‌ దొరల్లో దొంగ‌లు‌న్నారూ
మసి‌బూసి మారే‌డు‌కా‌య‌జేసే మహా మహా వాళ్లు వున్నారూ పహారా హుషార్‌!!

మాయ‌దారీ ఘరానా దొంగ‌లంటే మను‌షు‌లే‌నోయీ
మన‌యందే.‌.‌.‌మన‌ముందే.‌.‌.‌కల‌రోయీ
ఘరానా దొంగ‌లంటే మన‌షు‌లే‌నోయీ ||‌లో‌కా‌న‌||

ప్రక్క‌న‌వుండీ జేబులు కత్తి‌రించే బడా దొంగ‌లు‌న్నారు
దగ్గ‌ర‌చే‌రి‌న‌వా‌రిని దగా చేసి నాయ‌కు‌లుగా తిరు‌గు‌తున్న
పెద్ద‌మ‌ను‌షు‌లు‌న్నారూ .‌.‌.‌.‌ అయ్య‌య్య‌య్యయ్యో.‌.‌.‌ఎందరో మహా‌ను‌భా‌వులూ
కైపు‌జేసీ కుళ్లాయీ వేసి పోయే మను‌షు‌లు‌న్నారు
అరు‌గోరా.‌.‌.‌.‌ ఇరు‌గోరా .‌.‌.‌వారేరా
కుళ్లాయీ వేసి పోయే మను‌షు‌లు‌న్నారు ||‌లో‌కా‌న‌||
article imageతెలుగు సినిమా పాత‌తరం సంగీత దర్శ‌కు‌లకు హిందీ పాటల అను‌క‌రణ మీద అంత మోజెం‌దుకో తెలి‌యదు.‌ వాళ్లను అడి‌గితే ‌‘‌‘నిర్మా‌తలు ఫలానా హిందీ పాట ట్యూనులో పాటను తయారు చేయండి’‌’‌ అని అంటా‌రని తప్పిం‌చు‌కు‌నే‌వారు.‌ నిర్మా‌త‌లను కది‌లిస్తే, ‌‘‌‘ఏం చెయ్య‌మంటా‌రండీ నాలుగు రోజులు మ్యూజిక్‌ సిట్టిం‌గులో కూర్చున్నా ఒక్క మంచి ట్యూను కూడా విని‌పిం‌చరు ఈ సంగీత దర్శ‌కులు.‌ అవ‌తల షూటింగు షెడ్యూలు దెబ్బ‌తిం‌టుంది’‌’‌ అంటూ సంగీత దర్శ‌కుల మీదకు నెట్టే‌స్తారు నిర్మా‌తలు.‌ ఆ రోజోల్లో నిష్ణా‌తు‌లైన పి.‌ఆది‌నా‌రా‌య‌ణ‌రావు, సాలూరు రాజే‌శ్వ‌ర‌రావు, పెండ్యాల నాగే‌శ్వ‌ర‌రావు, టి.‌వి.‌రాజు, ఘంట‌సాల వెంక‌టే‌శ్వ‌ర‌రావు, తాతి‌నేని చల‌ప‌తి‌రావు వంటి సంగీత దర్శ‌కులు వుండే‌వారు.‌ మిగతా సంగీత దర్శ‌కులు విషయం ఎలా‌వున్నా టి.‌వి.‌రాజు, ఘంట‌సాల వంటి అద్భుత సంగీత సృష్టి‌క‌ర్త‌లకూ ఈ తిప్పలు తప్ప‌లేదు.‌ టి.‌వి.‌రాజు డి.‌వి.‌ఎస్‌ ప్రొడక్షన్స్‌ సంస్థకు, ఘంట‌సాల సుంద‌ర్లాల్‌ నహతా సంస్థ‌లకు ఆస్థాన సంగీత దర్శ‌కులు కావ‌డంతో నిర్మా‌తల అభీ‌ష్టా‌లకు లోబడి కొన్ని హిందీ పాటల ట్యూన్లను యధా‌త‌థంగా అను‌క‌రిం‌చా‌ల్సిన పరి‌స్థి‌తులు ఏర్ప‌డ్డాయి.‌ అయితే, ఇటు‌వంటి హిందీ పాటల ట్యూన్లపై ఆధా‌ర‌పడి తెలుగు పాటల్ని స్వర‌ప‌ర‌చినా, ఆ పాటల్లో తెలు‌గు‌త‌నాన్ని జోడించి వారు హిట్‌ చేసే‌వారు.‌ సాహిత్యం విష‌యా‌నికి వచ్చే‌స‌రికి, హిందీ ట్యూను మీట‌ర్‌కు సరి‌పో‌యేలా రాయాల్సి రావ‌డంతో, కొంత‌వ‌రకు సాహి‌త్యపు విలు‌వలు తగ్గడం సహ‌జమే.‌ డా|| సి.‌నారా‌య‌ణ‌రెడ్డి, దాశ‌రథి వంటి కవు‌లకు ఉర్దూ, హిందీ సాహి‌త్యం‌లోను, హిందూ‌స్తానీ సంగీ‌తం‌లోను ప్రవేశం వుండ‌డంతో వారు రాసే పాటల సాహిత్యం మీట‌ర్‌కు సరి‌పో‌యేది.‌ దీని అర్థం మిగతా తెలుగు సినీ కవులు కాపీ పాటల్లో సాహి‌త్యపు విలు‌వలు కాపా‌డ‌లే‌క‌పో‌యా‌రని కాదు.‌ ఇది ఒక పరి‌శీ‌ల‌నాం‌శం‌గానే పరి‌గ‌ణిం‌చాలి.‌ ఈ నేప‌థ్యంలో రాజశ్రీ ప్రొడక్షన్స్‌ పతాకం మీద సుంద‌ర్లాల్‌ నవాతా, డూండీలు రామ‌కృష్ణ దర్శ‌క‌త్వంలో నిర్మిం‌చిన ‌‘శభాష్‌ రాజా’‌ చిత్రం‌లోని ఒక పాట విష‌యా‌నికి వద్దాం.‌ ఖవ్వాలి పాటలు ఉత్త‌రా‌ది‌వారి సంప్రదాయం.‌ అందుకే వాటిని హిందీ సిని‌మాల్లో ఎక్కు‌వగా చూస్తూ ఉంటాం.‌ ప్రఖ్యాత నటుడు, దర్శక నిర్మాత గురు‌దత్‌ నిర్మిం‌చిన ‌‘చౌద్వీ కా చాంద్‌’‌ (1960) సిని‌మాలో షకీల్‌ బదా‌యుని రచిం‌చగా సంగీత దర్శ‌కుడు రవి స్వర‌ప‌ర‌చిన ‌‘దిల్‌ కి కహాని రంగ్‌ లాయీ హై, అల్లా దుహాయి హై, సాన్సే హై హల్కి‌హల్కి, ఆంఖే హై చల్కి‌చల్కి.‌.‌.‌ ఆజ్‌ తో జా పే బస్‌ ఆయీ హై, అల్లా దుహాయి హై దుహాయీ హై’‌ అనే పాటను ‌‘శభాష్‌ రాజా’‌ సిని‌మాలో అను‌క‌రిం‌చారు.‌ ఈ పాటను సిని‌మాలో మినూ ముంతాజ్‌ (హాస్య‌న‌టుడు మొహ‌మూద్‌ సోదరి) గురు‌దత్‌ సమక్షంలో ఆల‌పించే ఖవ్వాలి పాటగా చిత్రీ‌క‌రిం‌చారు.‌ అయితే, శభాష్‌ రాజా చిత్రంలో అను‌క‌రిం‌చిన ఈ పాటను రాజ‌సు‌లో‌చన, అక్కి‌నేని నాగే‌శ్వ‌ర‌రా‌వుతో కలిసి జేబులు దొంగ‌లించే పథ‌కంలో భాగంగా ఒక వీధి కూడ‌లిలో నాట్యం చేసే పాటగా ‌‘లోకాన దొంగలు వేరే లేరయ్యా’‌గా చిత్రీ‌క‌రిం‌చారు.‌ తెలుగు పాట కూడా ఖవ్వాలి స్థాయి‌లోనే ఉంటుంది.‌ ఖవ్వాలి పాట‌లకు ప్రధాన వాద్యాలు హార్మో‌నియం, తబలా, సారంగి.‌ కానీ తెలుగు పాట చిత్రీ‌క‌ర‌ణలో కేవలం డోలక్‌ వాయించే వాణ్ణి మాత్రమే చూపిం‌చడం అసం‌దర్భం అని‌పి‌స్తుంది.‌ అందుకు కారణం పాట మొత్తంలో కేవలం తబలా, హార్మో‌నియం సంగ‌తులు గట్టిగా విని‌పి‌స్తుం‌టాయి.‌ రామ‌కృష్ణ వంటి అను‌భ‌వ‌శాలి ఈ పాట చిత్రీ‌క‌ర‌ణలో డోలక్‌ వాద్యాన్ని మాత్రమే పెట్టి, హార్మో‌నియం, తబలా వాయించే కళా‌కా‌రు‌లను ఎందుకు పెట్ట‌లేదో అనే విషయం పెద్ద ప్రశ్నే! 1961లో అన్న‌పూర్ణా సంస్థ ‌‘ఇద్దరు మిత్రులు’‌ సినిమా నిర్మిం‌చింది.‌ ప్రఖ్యాత కవి దాశ‌రథి కృష్ణ‌మా‌చా‌ర్యను తమ సంస్థ ద్వారా పరి‌చయం చేస్తూ (దాశ‌రథి తొలి పాట వాగ్దానం సిని‌మాలో ‌‘నా కంటి పాపలో నిలి‌చి‌పోరా’‌ అని గుర్తిం‌చాలి) వారితో ‌‘ఖుషీ‌ఖు‌షీగా నవ్వుతూ’, ‌‘పాడ‌వేల రాధికా ప్రణ‌య‌సుధా గీతికా’‌ పాటలు రాయిం‌చారు.‌ ఈ రెండూ ట్యూనుకు ఇచ్చిన పాటలే అయినా అద్భు‌తంగా అమ‌ర‌డంతో సాలూరు రాజే‌శ్వ‌ర‌రావు ఒక ఖవ్వాలీ పాటను కూడా దాశ‌రథి చేత రాయి‌ద్దా‌మని అనడం, దానికి దుక్కి‌పాటి మధు‌సూ‌ద‌న‌రావు అంగీ‌కారం తెల‌పడం, దాశ‌రథి అద్భు‌తంగా ఆ ఖావ్వాలీ పాటకు సాహిత్యం సమ‌కూ‌ర్చడం వెంట‌వెం‌టనే జరి‌గి‌పో‌యాయి.‌ హైద‌రా‌బా‌ద్‌లో వుంటూ ఇక్కడి ఖవ్వాలీ పాటల తీరు‌తె‌న్నులు తెలి‌సి‌న‌వారు కావ‌డంతో దాశ‌ర‌థికి రాజే‌శ్వ‌ర‌రావు గురు‌దత్‌ సిని‌మా‌లోని ‌‘దిల్‌ కి కహాని రాంగ్‌ లాయీ హై, అల్లా దుహాయి హై దుహాయీ హై’‌ పాటను విని‌పించి తద‌ను‌గు‌ణంగా ఖవ్వాలీ శైలి‌లోనే తెలుగు పాట రాయించి అదే స్పూర్తితో స్వర‌ప‌ర‌చారు.‌ ఆ పాటే సుశీల ఆల‌పిం‌చిన ‌‘నవ్వాలీ నవ్వాలీ నీ నవ్వులు నాకే యివ్వాలి, అందాల చిన్న‌వాడా, బంగారు వన్నె‌కాదా, నీకున్న చింతా వంతా ఈనాడే తీరాలి’‌.‌ సాధా‌ర‌ణంగా ఖవ్వాలీ పాట పల్ల‌వితో మొదలై చర‌ణా‌నికి రాకుండా సాకీతో సాగి‌పో‌తుంది.‌ అందులో సాకిలే చర‌ణాలు.‌ అదే విధంగా దాశ‌రథి పాట కూడా సాగు‌తుంది.‌ శభా‌ష్‌రా‌జా‌లోని ‌‘లోకాన దొంగలు వేరే లేరయ్యా’‌ పాటను కూడా సాకీతో నడి‌పిం‌చినా అందులో ఖవ్వాలీ ఛాయలు లేకుండా ఘంట‌సాల జాగ్రత్త పడ్డారు.‌ తెలు‌గు‌దనం వుండేలా ఘంట‌సాల కానీ, రాజే‌శ్వ‌ర‌రావు కానీ హిందీ మాతృక పాటను మల‌చు‌కో‌వడం వారి‌ద్దరి ప్రతి‌భ‌గానే చెప్పు‌కో‌వాలి.‌ సుంద‌ర్లాల్‌ నహ‌తాకు ఘంట‌సాల ఎన్నో‌సార్లు ‌‘‌‘హిందీ ట్యూన్ల‌కన్నా ఇంకా అద్భు‌తంగా పాటలు స్వర‌ప‌రు‌స్తాను’‌’‌ అంటే, హిందీ చిత్రప‌రి‌శ్రమలో ఎక్కువ పరి‌చ‌యాలు, స్పూర్తి కలి‌గిన నహతా హిందీ బాణీ‌లనే అను‌క‌రిం‌చ‌మ‌నే‌వాడు.‌ తప్ప‌ని‌సరి పరి‌స్థి‌తు‌ల్లోనే ఘంట‌సాల ఆ మాతృక పాటల్ని తెలు‌గు‌తనం ఉట్టి‌ప‌డేలా మార్చి మట్లు కట్టే‌వారు.‌ గురు‌దత్‌ ‌‘కాగజ్‌ కే పూల్‌’‌ సినిమా నిర్మించి చేతుల కాల్చు‌కున్న తర్వాత నిర్మించిన చిత్రం ‌‘చౌద్వీ కా చాంద్‌’‌.‌ ఈ సినిమా సూపర్‌ హిట్‌ అయింది.‌ గురు‌దత్‌ సిని‌మా‌లకు సచి‌న్‌దేవ్‌ బర్మన్‌ ఆస్థాన సంగీత దర్శ‌కుడు.‌ ‌‘కాగజ్‌ కే పూల్‌’‌ ఒక‌ర‌కంగా గురు‌దత్‌ జీవిత కథే.‌ అందు‌చేత సినిమా విజ‌య‌వంతం కాదని బర్మన్‌ ఎంత‌చె‌ప్పినా గురు‌దత్‌ విన‌లేదు.‌ బర్మన్‌ అంచనా నిజ‌మ‌వ‌డంతో గురు‌ద‌త్‌కు మొహం చెల్లక ‌‘చౌద్వీ కా చాంద్‌’‌ సిని‌మాకు రవిని సంగీత దర్శ‌కు‌డిగా నియ‌మిం‌చాడు.‌ అయి‌తేనేం రవి అద్భుత సంగీతం అందించి సిని‌మాను సూపర్‌ హిట్‌ చేశాడు.‌ ఈ సినిమా టైటిల్‌ సాంగ్‌ బినాకా వార్షిక రేటిం‌గులో రెండవ స్థానం సాధిం‌చగా, ‌‘మిలీ కాక్‌ మే మోహ‌బ్బత్‌ జలా దిల్‌ కా ఆశి‌యానా?’, ‌‘మేరా యార్‌ బనా హై దుల్హా’‌ పాటలు 23, 25 స్థానాల్లో నిలి‌చాయి.‌ ‌‘చౌద్వీ కా చాంద్‌ హో’‌ టైటిల్‌ పాట ఆల‌పిం‌చిన మహ‌మ్మద్‌ రఫీకి, ఆ పాట రచిం‌చిన షకీల్‌ బదా‌యు‌నికి ఫిలిం‌ఫేర్‌ బహు‌మ‌తులు లభిం‌చాయి.‌

article image

తొలి హిందీ బాణీ పాటతెలుగు సారూప్య పాటCopyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.